బైరెడ్డి అటువైపే చూస్తున్నారా?

రాయల సీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన అతి తక్కువ కాలంలో మూడు పార్టీలు మారిపోయారు. అయినా ఇప్పుడు మరో పార్టీ వైపు [more]

Update: 2019-08-24 03:30 GMT

రాయల సీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన అతి తక్కువ కాలంలో మూడు పార్టీలు మారిపోయారు. అయినా ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ సీమ ప్రాంతంలో బలంగా విన్పిస్తుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమారుడు సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. నందికొట్కూరు ఇన్ ఛార్జిగా కూడా సిద్ధార్థ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లాలన్నా సిద్ధార్థ్ రెడ్డి ప్రమేయం తప్పకుండా ఉంటుందంటున్నారు.

ఒకప్పుడు బలమైన నేత అయినా….

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమలో బలమైన నేతగా ఉన్నారు. అయితే అది ఒకప్పటి మాట. 1999 వరకూ నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి ఫ్యామిలీదే హవా. వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1989 నుంచి 1999 వరకూ బైరెడ్డి కుటుంబానికి నందికొట్కూరు అడ్డాగా ఉంది. అయితే ఆ తర్వాత నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ కావడంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి క్రమంగా ఈ నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోతోంది.

నందికొట్కూరులో….

ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మద్దతుతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. తిరిగి నందికొట్కూరు బైరెడ్డి కుటుంబం పరమయింది. అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు రాయలసీమ పరిరక్షణ ఉద్యమ సమితిని పెట్టారు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీని రద్దు చేశారు. తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కర్నూలు లో జరిగిన రాహుల్ సభలో హడావిడి చేశారు.

తాజాగా మరో నిర్ణయానికి….

ఆ తర్వాత కాంగ్రెస్ ను కూడా వదిలేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. అమరావతి వెళ్లి చంద్రబాబును కలసి వచ్చిన తర్వాత బైరెడ్డి టీడీపీకి జై కొట్టేశారు. కానీ ఎన్నికల ఫలితాల్లో కర్నూలు జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీలో ఉన్నప్పటికీ ఐదేళ్ల పాటు ఏ రకమైనా పదవి దక్కే అవకాశం లేదు. అందుకే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న టాక్ ఉంది. సోదరుడు కుమారుడు సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలో ఉండటంతో అటువైపు చూస్తున్నారు. అది సాధ్యం కాకుంటే బీజేపీలో అయినా చేరడానికి సిద్ధమవుతున్నారట.

Tags:    

Similar News