పీకే జాడేలేదే… అందుకనే అలాగా?

బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారన్నది తేలదు. రెండు కూటములు గట్టి పోటీ ఇచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రశాంత్ [more]

Update: 2020-11-09 18:29 GMT

బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారన్నది తేలదు. రెండు కూటములు గట్టి పోటీ ఇచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ప్రమేయం లేకుండా జరగడమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్ లో నిన్న మొన్నటి వరకూ ప్రశాంత్ కిషోర్ తన రాజకీయాన్ని కొనసాగించారు. జనతాదళ్ యు ఉపాధ్యక్షుడిగా కూడా ప్రశాంత్ కిషోర్ నియమితులయ్యారు.

తన వారసుడంటూ…..

ఒకదశలో ప్రశాంత్ కిషోర్ ను తన వారసుడిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రకటించారు. జేడీయూను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని అందరూ భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సీఏఏ నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించారు. ఈ విషయంలో పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టడంతో నితీష్ కుమార్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

వ్యూహకర్తగా పనిచేస్తారని….

నితీష్ కుమార్ అంటే ప్రశాంత్ కిషోర్ కు ఎనలేని అభిమానం. గౌరవం కూడా. అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆయనను ప్రశాంత్ కిషోర్ పన్నెత్తు మాట అనలేదు. అయితే బీహార్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఏదో ఒక పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తారని గతంలో ప్రచారం జరిగింది. ఆర్జేడీ ఈ మేరకు సంప్రదింపులు జరిపిందన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే ప్రశాంత్ కిషోర్ ను సస్పెండ్ చేయడంతో జేడీయూకు పెద్ద దెబ్బతగిలిందని కూడా కథనాలు వెలువడ్డాయి.

నితీష్ పై గౌరవంతోనే…..

కానీ ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఏపీ, ఢిల్లీ లో పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి వారిని అధికారంలోకి తెచ్చారు. ఇక తమిళనాడు, కర్ణాటకలో కూడా ప్రశాంత్ కిషోర్ డీల్ కుదుర్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో దీదీని గెలిపించే పనిలో ఉన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున వ్యూహకర్తగా పనిచేయనున్నారు. మరి తన సొంత ప్రాంతమైన బీహార్ ను మాత్రం ప్రశాంత్ కిషోర్ పట్టించుకోలేదు. దీనికి కారణం నితీష్ పట్ల ఉన్న గౌరవమేనంటున్నారు.

Tags:    

Similar News