వేడెక్కిన ప్రచారం… ఎవరిదో గెలుపు?

బీహార్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. మొత్తం మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల తమ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఈసారి బీహార్ ఎన్నికలు [more]

Update: 2020-10-19 17:30 GMT

బీహార్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. మొత్తం మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల తమ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఈసారి బీహార్ ఎన్నికలు కరోనా వైరస్ కాలంలో జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా తో బీహార్ లో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలను కూడా రాష్ట్రానికి రప్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అభ్యర్థులను ఖరారు చేసి…..

మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన తొలిదశ పోలింగ్ ఉండటంతో పార్టీన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా బీజేపీ కూటమి ఇటు సోషల్ మీడియా, అటు సభల ద్వారా ప్రజల్లోకి వెళుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ మొత్తం 110 స్థానాల్లో పోటీ చేస్తుండగా, 11 స్థానాలను దాని మిత్రపక్షాలకు ఇచ్చింది.

బీజేపీ, జేడీయూ కలసి…..

ఇక బీజేపీ మిత్రపక్షమైన జనతాదళ్ యు 115 స్థానాల్లో పోటికి దిగనుంది. ఏడు స్థానాలను తన మిత్రపక్షమైన జితిన్ రాం మాంఝీకి చెందిన హెచ్ఏఎం కు కేటాయించింది. ఈ 122 స్థానాల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరోసారి నితీష్ కుమార్ నే ప్రకటించడంతో ఎన్నికల్లో విజయం సాధించి పెట్టే బాధ్యతను కూడా ఆయనపైనే ఉంది.

రాహుల్, ప్రియాంకలు…..

విపక్ష పార్టీ కూటమి కూడా ప్రచారంలో ముందుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్ కు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుపున రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా పాల్గొననున్నారు. మరో వైపు రాష్ట్రీయ జనతాదళ్ తరుపున తేజస్వియాదవ్ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం మీద బీహార్ ఎన్నికలు అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News