ఇద్దరికి బాగా చెడిందటగా?

ఇద్దరూ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఇద్దరూ గురు శిష్యులే. కానీ వారి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అధికార పార్టీలో [more]

Update: 2020-08-31 11:00 GMT

ఇద్దరూ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఇద్దరూ గురు శిష్యులే. కానీ వారి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అధికార పార్టీలో ఇది చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య పూర్తిగా చెడిందన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం నియోజకవర్గాల్లో వేలు పెట్టడమే. పైకి ఇద్దరు విమర్శలు చేసుకోనప్పటికీ లోలోపల మాత్రం ఒకరంటే ఒకరు రగిలిపోతున్నారని చెబుతున్నారు. దీంతో వైసీీపీ క్యాడర్ ఆందోళన వ్యక్తమవుతోంది.

రాజకీయ గురువు అంటూనే…..

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భూమన కరుణాకరెడ్డి రాజకీయ గురువు. ఈ విషయాన్ని చెవిరెడ్డి బాహాటంగా చెబుతుంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి, వైఎస్ తో పరిచయానికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి. 2012లో లో చిరంజీవి రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో భూమన ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల స్వల్ప ఆధిక్యతంతో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నుంచి విజయం సాధించారు.

మూడు పదవులు

కాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం 2014, 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి రెండుసార్లు వరసగా విజయం సాధించారు. దీంతో జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మూడు పదవులు ఇచ్చారు. తుడా ఛైర్మన్, ప్రభుత్వ విప్, టీటీడీ సభ్యుడి పదవులు వరించాయి. తుడా ఛైర్మన్ కావడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది భూమన వర్గానికి రుచించడం లేదు. ప్రధానంగా మంత్రుల పర్యటనలోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా ఛైర్మన్ హోదాలో తిరుపతి లో పర్యటించడం భూమన వర్గానికి మింగుడుపడకుండా ఉంది.

పర్యటనల్లో పోటా పోటీ…..

భూమన కరుణాకర్ రెడ్డి మంత్రి పదవిపై ఎంతో ఆశపెట్టుకున్నారు. కానీ ఆయనకు దక్కలేదు. తనకు ఇవే చివరి ఎన్నికలని భూమన కరుణాకర్ రెడ్డి హింట్ కూడా ఇచ్చారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు పదవులు దక్కించుకోవడం భూమన వర్గానికి మింగుడపడటం లేదు. కరోనా సమయంలోనూ ఇద్దరూ పోటీ పడి ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. ఇద్దరికి బాగా చెడిందన్న కామెంట్స్ తిరుపతిలోని పార్టీ క్యాడర్ నుంచే విన్నిస్తుండటం విశేషం.

Tags:    

Similar News