భూమనపై కరుణ చూపేట్లు కన్పించడం లేదుగా?

భూమన కరుణాకర్ రెడ్డి ఇవే తన చివరి ఎన్నికలు చెప్పారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో [more]

Update: 2020-10-13 14:30 GMT

భూమన కరుణాకర్ రెడ్డి ఇవే తన చివరి ఎన్నికలు చెప్పారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో సత్తా చూపించాల్సిన బాధ్యత భూమన కరుణాకర్ రెడ్డిపై ఉంది. తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి మెజారిటీ తెప్పించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది.

సీనియర్ నేతగా…..

భూమన కరుణాకర్ రెడ్డి సీనియర్ నేత. జగన్ కు దగ్గర బంధువంటారు. తొలి నుంచి వైసీపీని నమ్ముకున్న నేత. అయితే భూమన కరుణాకర్ రెడ్డికి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఎలాంటి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. తిరుపతి ఎమ్మెల్యే కావడంతో ఆటో మేటిక్ గా టీటీడీ పాలక మండలి సభ్యుడవుతారు. ఇక జగన్ కొత్తగా ఆయనకు ఇచ్చిందేమీ లేదు. సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగానే భూమనకు మంత్రి పదవి దక్కలేదంటారు.

గత ఎన్నికల్లోనూ…..

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ భూమన కరుణాకర్ రెడ్డి అతి తక్కువ ఓట్లతో బయటపడగలిగారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ పై కేవలం 700 ఓట్ల తేడాతోనే గెలిచారు. ఎన్నికల తర్వాత భూమన జనంలో బాగానే తిరుగుతున్నా తిరుపతి ప‌ట్టణ అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నది వాస్తవం. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దీంతో ఆయన ప్రజలకు చేరువగానే ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అసంతృప్తి ఉందని వైసీపీ నేతలే చెబుతున్నారు.

ఫలితాలను బట్టే…..

ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది. ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ రావాల్సిందేనని ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశించారు. ఏమాత్రం తేడా వచ్చినా రానున్న కాలంలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో పదవి లభించడం కష్టమే. ఇవే తన చివరి ఎన్నికలు చెప్పినా జగన్ ఫలితాలు రాకుంటే కరుణ చూపించకపోవచ్చు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి వర్గంలో చర్చగా మారింది.

Tags:    

Similar News