ఈయనను దూరం పెట్టారా? ఈయనే దూరం జరిగారా?

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా ఆయనదే పెత్తనం. పార్టీలో తిరుగులేని నేతగా ఉన్నారు. జగన్ కూడా ఆయనకు ఇచ్చే ప్రయారిటీ మరెవ్వరికీ ఇవ్వలేదు. కట్ చేస్తే అధికారంలోకి [more]

Update: 2021-01-21 15:30 GMT

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా ఆయనదే పెత్తనం. పార్టీలో తిరుగులేని నేతగా ఉన్నారు. జగన్ కూడా ఆయనకు ఇచ్చే ప్రయారిటీ మరెవ్వరికీ ఇవ్వలేదు. కట్ చేస్తే అధికారంలోకి రాగానే ఆయన పార్టీ అధినేతకు దూరమయిపోయారు. ఆయనే తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి అసెంబ్లీ నుంచీ అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన భూమన కరుణాకర్ రెడ్డి యాక్టివ్ గా లేకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న సమయంలో భూమన మౌనం ఆందోళన కల్గిస్తుంది.

అత్యంత ఆత్మీయుడిగా…..

భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన వెంటే నడిచారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంటే ఉన్నారు. వైఎస్ కుటుంబంలోనూ కీలక వ్యక్తిగా మారారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

తనను విస్మరించినా….

తన కంటే జూనియర్లకు అన్ని పదవులు వచ్చినా తాను మాత్రం నామమాత్రపు ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. ఎన్నికలు అయిన తర్వాత రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. అయినా మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు చోటు లభించలేదు. వచ్చే ఏడాది జరగనున్న విస్తరణలోనూ మంత్రి పదవి దక్కుతుందన్న గ్యారంటీ భూమన కరుణాకర్ రెడ్డికి లేదు. అందుకే ఆయన అంటీ ముట్టనట్లు ఉన్నారని చెబుతున్నారు.

ఉప ఎన్నిక రాకతో….

జగన్ డిక్లరేషన్ వివాదం, ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి స్పందించలేదు. వరస సంఘటనలు వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టినా ఆయన మాత్రం బయటకు రాలేదు. అసలే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన బలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి యాక్టివ్ గా లేకుంటే లోక్ సభ ఉప ఎన్నికల్లో ఇబ్బంది పడక తప్పదంటున్నారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికైనా యాక్టివ్ కావాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News