Bhuma : భూమాకు హ్యాండ్ ఇవ్వడం గ్యారంటీ

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబ స్ట్రాటజీ మార్చనున్నారు. అనేక విషయాల్లో రాజీపడేందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఎన్ని అసంతృప్తులు తలెత్తినా తాను అనుకున్న మేరకు, సర్వే ప్రకారమే టిక్కెట్లు [more]

Update: 2021-11-07 13:30 GMT

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబ స్ట్రాటజీ మార్చనున్నారు. అనేక విషయాల్లో రాజీపడేందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఎన్ని అసంతృప్తులు తలెత్తినా తాను అనుకున్న మేరకు, సర్వే ప్రకారమే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయాన్ని చూచాయగా నేతలకు చెప్పారు. ఇన్ ఛార్జి అనే వాళ్లకు టిక్కెట్ గ్యారంటీ లేదని, పనితీరు, ప్రజల్లో వారి బలాన్ని అంచనా వేసి టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు బహిరంగంగానే చెప్పారు. దీంతో నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది.

ఉప ఎన్నికల్లో గెలిచి…..

భూమా బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికల్లోనే ఎన్నికయ్యారు. సర్వశక్తులు ఒడ్డితేనే ఆయన ఉప ఎన్నికల్లో గెలవగలిగారు. భూమా నాగిరెడ్డి కి అత్యంత సన్నిహితులు కూడా ఇప్పుడు భూమా కుటుంబాన్ని వీడిపోయారు. ఏవీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి అనేక మంది నేతలు ఆ కుటుంబానికి దూరమయ్యారు. దీంతో నంద్యాలలో టిక్కెట్ ఈసారి చంద్రబాబు ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

బలహీనమైన నాయకత్వం….

2019 ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా రవిచంద్రారెడ్డిపై దారుణ ఓటమిని చవి చూశారు. జగన్ వేవ్ అని సరిపెట్టుకున్నా తర్వాత కూడా ఏ ఎన్నికల్లో నంద్యాలలో టీడీపీ కోలుకోలేని పరిస్థితి. రోజురోజుకు శిల్పా వర్గం బలోపేతం అవుతుండగా, టీడీపీ బలహీనమవుతుంది. దీనికి కారణం బలమైన నాయకత్వం, కొన్ని సామాజికవర్గాలు టీడీపీకి దూరం కావడమేనని గుర్తించారు. ప్రధానంగా మైనారిటీల్లో అధికభాగం ఈ నియోజకవర్గంలో వైసీపీ వెంట ఉన్నారని టీడీపీ హైకమాండ్ గుర్తించింది.

నేతల నుంచి వ్యతిరేకత….

భూమా బ్రహ్మానందరెడ్డికి టీడీపీలోనే వ్యతిరేకత కన్పిస్తుంది. ఆయనను వ్యతిరేకించే నేతలు అనేకమంది ఉన్నారు. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నుంచి ఏవీ సుబ్బారెడ్డి వరకూ భూమా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని పక్కన పెడతారన్న టాక్ విన్పిస్తుంది. ఇక్కడ అందరికీ ఆమోదయోగ్యమైన మైనారిటీ నేతకు టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

Tags:    

Similar News