అందుకే ఈయన చూపు వైసీపీ వైపు…త్వరలోనేనట

ఒక‌వైపు టీడీపీలో అంత‌ర్గత పోరు సాగుతోంది. క‌ర్నూలు జిల్లాలో నేత‌ల‌కు నేత‌ల‌కు మ‌ధ్య మ‌రోసారి అగ్గి లేకుండా మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి కుటుంబం ఇప్పుడు సూత్రం [more]

Update: 2020-06-10 02:00 GMT

ఒక‌వైపు టీడీపీలో అంత‌ర్గత పోరు సాగుతోంది. క‌ర్నూలు జిల్లాలో నేత‌ల‌కు నేత‌ల‌కు మ‌ధ్య మ‌రోసారి అగ్గి లేకుండా మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి కుటుంబం ఇప్పుడు సూత్రం లేని గాలి ప‌టం మాదిరిగా.. గాలిలో వేలాడుతోంది. ఈ స‌మ‌యంలో ఈ కుటుంబానికి చెందిన కీల‌క నాయ‌కుడు, రాజ‌కీయాల‌కు కొత్తే అయినా.. 2017 ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మాజీ ఎమ్మెల్యే యువ‌కుడు భూమా బ్రహ్మానంద‌రెడ్డి.. తెర‌వెనుక త‌న దారి తాను చూసుకుంటున్నారని ప్రచారం జ‌రుగుతోంది. నంద్యాల ఉప పోరులో ద‌గ్గరుండి.. వ‌రుస‌కు అన్న అయిన బ్రహ్మానంద‌రెడ్డికి మాజీ మంత్రి, నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ గెలిచేలా చేశారు. ఆ ఉప ఎన్నిక‌ను అప్పట్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో చూశాం.

గత ఎన్నికల నాటి నుంచే….

అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి టికెట్ విష‌యంలో చంద్రబాబు వ‌ద్ద పెద్ద పంచాయితీనే జరిగింది. భూమా బ్రహ్మానంద‌రెడ్డికి టికెట్ ఇచ్చే విష‌యంలో అఖిల ప్రియ మౌనం వ‌హించారు. ఆ టిక్కెట్‌ను త‌న సొంత సోద‌రుడికే ఇవ్వాల‌ని అఖిల మంత‌నాలు చేశారు. దీంతో బాబు.. భూమా బ్రహ్మానంద‌రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ఆదిలో మొగ్గు చూప‌లేదు. దీంతో బ్రహ్మానంద‌రెడ్డి ఒంట‌రిగానే రోడ్డె క్కారు. టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్టారు. టికెట్ ఇవ్వని ప‌క్షంలో చంద్రబాబు ఫొటోతోనే తాను ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతాన‌ని హెచ్చరించారు. ఈ క్రమంలో ఏమ‌నుకున్నారో ఏమో.. చంద్రబాబు భూమా బ్రహ్మానంద‌రెడ్డికే టికెట్ ఇచ్చారు. అయితే, భూమా బ్రహ్మానంద‌రెడ్డి ప‌రాజ‌యం పాల‌య్యారు.

సోదరుడి కోసం….?

కేవ‌లం రెండు సంవ‌త్సరాల్లోనే భూమా బ్రహ్మానంద‌రెడ్డి ఓడిపోవ‌డం వెనుక‌.. అఖిల ప్రియ మంత్రాంగం ఉంద‌నే ప్రచారం జ‌రిగింది. అంటే.. అఖిల ప్రియ ఆది నుంచి చెప్పిన‌ట్టు నంద్యాల‌-ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ కుటుంబమే చ‌క్రం తిప్పాల‌ని ఆమె భావిస్తున్నారు. వ‌చ్చే 2024 నాటికి త‌న సొంత సోద‌రుడు జ‌గ‌ద్విఖ్యాత్‌రెడ్డిని రంగం లోకి దింపాల‌ని భావించారు. ఈ క్రమంలోనే భూమా బ్రహ్మానంద‌రెడ్డిని ప‌క్కకు త‌ప్పించే ప్రయ‌త్నం చేశారు. ఇ న్నాళ్లు ఓర్చుకున్న బ్రహ్మానంద‌రెడ్డి.. ఇక‌, పార్టీలోనూ త‌న‌కు మ‌ద్దతు ల‌భించ‌క‌పోయే స‌రికి.. ఇప్పుడేకం గా.. సైకిల్ దిగిపోవాల‌ని నిర్ణయించుకున్నారు.

ఫోన్ లో చర్చలు….

దీనికి సంబంధించి జిల్లా ఇంచార్జ్ మంత్రి, వైసీపీ నేత‌తో భూమా బ్రహ్మానంద‌రెడ్డి.. ఫోన్ చ‌ర్చలు చేసిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. పైగా బ్రహ్మానంద‌రెడ్డి మామ బ‌న‌గాన‌ప‌ల్లి ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి. దీంతో ఆ ఫ్యామిలీ నుంచి కూడా పార్టీ మారాల‌న్న ఒత్తిడి.. ఇటు అఖిల‌ప్రియ బ్రహ్మానందరెడ్డిని పార్టీలో తొక్కేయ‌డం లాంటి ప‌రిణామాలు ఆయ‌న్ను రాజ‌కీయంగా ఇబ్బంది పెడుతున్నాయ‌ని టాక్‌..? ఇక ఆయ‌న పార్టీ మార్పుపై క్లారిటీ రావాల్సి ఉంద‌ని, ఇది వ‌స్తే.. వ‌చ్చే రెండుమూడు మాసాల్లోనే భూమా బ్రహ్మానంద‌రెడ్డి పార్టీ మారిపోవ‌చ్చని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News