భూమా ఫ్యామిలీలో చీలిక తప్పదా?

నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు అక్క రాజకీయం, మరోవైపు అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో ఆయన రాజకీయంగా సతమతమవుతున్నారు. భూమా కుటుంబంలో వివాదలు [more]

Update: 2020-05-10 08:00 GMT

నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు అక్క రాజకీయం, మరోవైపు అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో ఆయన రాజకీయంగా సతమతమవుతున్నారు. భూమా కుటుంబంలో వివాదలు తలెత్తాయన్న ప్రచారం జరుగుతోంది. నాగిరెడ్డి చనిపోయిన తర్వాత తన సోదరుడు భూమా బ్రహ్మానంద‌రెడ్డికి టికెట్ దక్కించుకోవడ‌మే కాకుండాఉప ఎన్నికల్లో గెలిపించుకునేందుకు కూడా అఖిల ప్రియ కృషి చేశారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ తుఫాన్‌తో బ్రహ్మానందరెడ్డి కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అయినా కూడా టీడీపీలోనే ఉంటూ.. కరోనా సమయంలో విమర్శలు చేస్తున్నారు.

సోదరుడిని దించడంతో….

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌డిచిన రెండు నెలలుగా మాత్రం బ్రహ్మానందరెడ్డి పూర్తిగా సైలెంట్‌గా ఉంటున్నారు. దీనికి కార‌ణం తాజాగా వెలుగు చూసింది. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను త‌న సోద‌రుడు జ‌గ‌ద్వి ఖ్యాత్ రెడ్డికి ఇవ్వాల‌ని పార్టీ అధిష్టానంపై అఖిల ప్రియ ఒత్తిడి చేస్తున్నారట‌. ఇప్పటికే ఇక్కడి కార్యక్రమాల్లో తనను పక్కన పెట్టారని మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానంద‌రెడ్డి భావిస్తున్నారు. ఏ కార్యక్రమ‌మైనా.. కూడా జ‌గ‌ద్విఖ్యాత్ రెడ్డితోనే అఖిలప్రియ చేయిస్తున్నారు. అయితే, అధికారికంగా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ క్రమంలోనే రెండు నెల‌ల కింద‌ట హైద‌రాబాద్‌లో యువ నాయ‌కులు లోకేష్ ఫ్యామిలీ ఇచ్చిన విందుకు జ‌గ‌ద్విఖ్యాత్‌ను పంపాల‌ని అఖిల ప్రియ నిర్ణయించుకున్నారు.

ఊగిసలాట ధోరణిలో….

కానీ, జగద్విఖ్యాతరెడ్డికి ఆహ్వానం అంద‌లేద‌ట‌. దీనికితోడు బ్రహ్మానంద‌రెడ్డిని త‌ప్పుకోవాల‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ సొంత సోద‌రుడు జగ‌ద్విఖ్యాత్‌రెడ్డిని నిల‌బెడ‌తామ‌ని అఖిల ప్రియ చెబుతున్నారు. దీనికి బ్రహ్మానంద రెడ్డి వ‌ర్గంతో పాటు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇక నంద్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్‌చార్జ్ బ్రహ్మానంద‌రెడ్డి అటు బ‌న‌గాన‌ప‌ల్లె వైసీపీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డికి స్వయానా అల్లుడు కావ‌డంతో ఆయ‌న కూడా టీడీపీలో ఉండాలా ? వైసీపీకి వెళ్లాలా ? అన్న ఊగిస‌లాట ధోర‌ణిలో ఉన్నార‌ట‌.

ఇక్కడి నుంచి తప్పించాలని…

అఖిల మాత్రం నంద్యాల సీటు నుంచి బ్రహ్మానంద‌రెడ్డిని త‌ప్పించాల‌ని విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని భోగ‌ట్టా. ఈ ప‌రిణామాల‌తో ఒక‌వైపు కుటుంబ వివాదాలు కూడా న‌డుస్తున్నాయి. భూమా ఫ్యామిలీలోనే కొంద‌రు బీజేపీలోకి వెళ్లిపోయారు. మ‌రోప‌క్క, అధిష్టానం కూడా కుటుంబ వివాదాల‌తో వారే ఏదో ఒక‌టి తేల్చుకున్నాక‌.. మ‌నంతీర్పు చెబుదాం. అనే ధోర‌ణిలో ఉంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. బ్రహ్మానందరెడ్డి మాత్రం భూమా వర్గం తన నుంచి వేరు కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్తతలు పాటిస్తున్నారు. కానీ చివరకు అక్క రాజకీయంలో తన భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు.

Tags:    

Similar News