మామ తో రాయబారాలా?

తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? తెలుగుదేశం పార్టీలో ఇమడలేక పోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. భూమా అఖిలప్రియ త్వరలోనే వైసీపీలో [more]

Update: 2021-06-16 14:30 GMT

తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? తెలుగుదేశం పార్టీలో ఇమడలేక పోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. భూమా అఖిలప్రియ త్వరలోనే వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వైసీపీ నుంచి తమకు టిక్కెట్లపై స్పష్టమైన హామీ వస్తేనే చేరాలని భూమా అఖిలప్రియ భావిస్తున్నారు. ఈమేరకు పార్టీ పెద్దలతో మంతనాలను కూడా ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది.

అనేక రకాల ఇబ్బందులు…..

నిజానికి భూమా అఖిలప్రియ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. 2014 ఎన్నికల్లో తల్లి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా అఖిలప్రియ విజయం సాధించారు. అయితే తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు ఆమె కూడా టీడీపీలోకి వెళ్లారు. మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి సయితం టీడీపీలోకి తమ వెంట వచ్చారు. అయితే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా అఖిలప్రియ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆర్థికపరమైన…?

రాజకీయ ఇబ్బందులు మాత్రమే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా భూమా అఖిలప్రియ ను చుట్టుముట్టాయి. తెలుగుదేశం పార్టీకి భవిష‌్యత్ ఉంటుందన్న నమ్మకం లేదు. దీంతో భూమా అఖిలప్రియ వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ కుటుంబానికి రాజకీయంగా పట్టున్న ఆళ్లగడ్డ మాత్రమే తమకు కావాలని భూమా అఖిలప్రియ కోరుతున్నారని తెలిసింది. నంద్యాల విషయంలో రాజీపడేందుకు కూడా ఆమె సిద్ధమయ్యారు.

మేనమామ ద్వారా?

ఈ మేరకు భూమా అఖిలప్రియ మామ ఎస్వీ మోహన్ రెడ్డి ఈ మేరకు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఎస్వీ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందే వైసీపీలోకి తిరిగి వచ్చారు. ఆయన ప్రస్తుతం పార్టీలో కంఫర్ట్ గానే ఉన్నారు. తన సోదరి పిల్లలు రాజకీయంగా ఇబ్బందులు పడుతుండటంతో వారిని వైసీపీలోకి తీసుకురావాలని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తం మీద భూమా అఖిలప్రియ షరతులకు వైసీపీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News