ఆ “భాగ్యం” కొనసాగుతుందా? తొలి దశలోనే బ్యాడ్ రిమార్క్

ఆమె పేరు భాగ్యలక్ష్మి. అందుకే ఇలా పార్టీలో చేరి అలా టికెట్ దక్కించుకుంది. అంతే దూకుడుగా మంచి మెజారిటీతో విశాఖ జిల్లా పాడేరు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది. [more]

Update: 2020-03-30 00:30 GMT

ఆమె పేరు భాగ్యలక్ష్మి. అందుకే ఇలా పార్టీలో చేరి అలా టికెట్ దక్కించుకుంది. అంతే దూకుడుగా మంచి మెజారిటీతో విశాఖ జిల్లా పాడేరు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది. ఇక ఆమె రాష్ట్ర గిరిజన సలహా మండలిలో మెంబర్ గా ఉంది. డిగ్రీ వరకూ చదువుకున్న బాగ్యలక్ష్మిది రాజకీయ కుటుంబమే. ఆమె తండ్రి కొట్టిగళ్ళ చిట్టినాయుడు టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆ తరువాత పార్టీకి దూరమయ్యారు. మళ్ళీ చాన్నాళ్ళకు వారసురాలిగా భాగ్యలక్ష్మి వైసీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమెకు ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారి ఆశీస్సులు గట్టిగా ఉండడంతో ఆమె కంటే ముందు పార్టీలో చేరిన వారికి అవకాశం లేకుండా పోయింది.

ఒంటెద్దు పోకడలు….

ఇక ఎమ్మెల్యెగా నెగ్గింది కానీ భాగ్యలక్ష్మి ఒంటెద్దు పోకడలు పోతోందని వైసెపీలోనే విమర్శలు ఉన్నాయి. ఆమె పార్టీలో అందరినీ కలుపుకుని పోరని క్యాడర్ హైకమాండ్ కి ఫిరాదు చేశారు. ఈ కారణంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆమెను పక్కన పెట్టారని కూడా ప్రచారంలో ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గంలో అందరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆమె అతి తక్కువ కాలంలోనే పార్టీలో పెద్దల కంట్లో పడి బ్యాడ్ రిమార్క్స్ తెచ్చుకున్నారని అంటున్నారు.

పోటీ గట్టిగానే…..

ఇక భాగ్యలక్ష్మికి పక్కలో బల్లెం మాదిరిగా అదే పార్టీలో సీనియర్ నేత విశ్వేశ్వరరావు ఉన్నారు. ఆయనకు బలం, బలగం బాగానే ఉంది. ఇక రాజకీయ వారసురాలు అన్న ప్లస్ పాయింట్ తో భాగ్యలక్ష్మి టికెట్ సాధించారు. ఇక మరో వైపు చూసుకుంటే ఈ మధ్యనే వైసీపీలో చేరిన పాడేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా ఉన్నారు. ఆయనకు కూడా బాగానే పలుకుబడి ఉంది. ఆయన తన కుమార్తె డాక్టర్ దర్శిని కోసం పార్టీలో చేరారు. దాంతో ఆమెకు అకామిడేషన్ కల్పిస్తే భాగ్యలక్ష్మికి అది పెద్ద తలనొప్పిగా ఉంటుంది.

ఆమె చూస్తున్నారా..?

వీటికి తోడు అన్నట్లుగా పాడేరులో 2014 ఎన్నికల్లో గెలిచి అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి కూడా మళ్ళీ వీలు ఉంటే వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. ఆమె విషయంలో అధినాయకత్వం మెత్తబడితే ఏ క్షణానైనా చేరిపోవచ్చు. ఇలా పాడేరు నియోజకవర్గంలో నాలుగు దిక్కులా బలమైన నేతలు ఉన్నారు. అయినా సరే ఇవన్నీ పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలకు భాగ్యలక్ష్మి పోతున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆమె రాజకీయ భాగ్యానికి అతి పెద్ద చెక్ పడిపోతుందని విశ్లేషణలు ఉన్నాయి. మరి దారికి వచ్చి లెక్కలు సరిచేసుకుంటారో లేదో ఆమె ఇష్టమేనని అంటున్నారు.

Tags:    

Similar News