ఇంచ్ పెరగకున్నా బిల్డప్ కు తక్కువ లేదు

ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి అంటే ఆటలో అరటిపండు అని చెప్పాలి. ఆ పార్టీ ఎంతసేపు ఢిల్లీలో అధికారం ఉందని డప్పు కొట్టుకుని మురిసిపోవాలి తప్ప ఏపీలో [more]

Update: 2019-08-16 06:30 GMT

ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి అంటే ఆటలో అరటిపండు అని చెప్పాలి. ఆ పార్టీ ఎంతసేపు ఢిల్లీలో అధికారం ఉందని డప్పు కొట్టుకుని మురిసిపోవాలి తప్ప ఏపీలో ఇంచ్ కూడా పెరగడం లేదు. చంద్రబాబుని దించేశాం అని చెప్పుకుంటున్న బీజేపీ తాము నోటా కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న సంగతి కావాలని మరుగునపెడుతోంది. ఇక ఏపీలో తామే అధికారంలోకి వస్తామని బిల్డప్ ఇస్తున్న కమలం పార్టీ అందరి కంటే తొందరపడి కూతలు పెడుతోంది. జగన్ ని గత కొంతకాలంగా ఘాటుగా విమర్శిస్తూ టీడీపీ కంటే ఎక్కువగా రచ్చ చేస్తోంది. దీంతో వైసీపీ నేతలకు చిర్రెత్తుకువస్తోంది. జాతీయ స్థాయిలో తాము బాగా ఉంటూ మోడీ, షాలతో మంచి సఖ్యత కనబరుస్తూంటే ఏపీలో మాత్రం ఈ తలనొప్పి ఏంటని వైసీపీ నేతలు మండిపోతున్నారు. జగన్ వద్ద ఇదే విషయం ప్రస్తావిస్తే బీజేపీని అలా వదిలేయాలని, పట్టించుకోవద్దని పార్టీ నేతలకు సూచిస్తున్నారట.

బాబు వ్యూహం జగన్ కి ఉందా?

చంద్రబాబు నాలుగేళ్ల పాటు బీజేపీతో చెలిమి చేశారు. అదే సమయంలో ఏపీ బీజేపీలోని ఓ వర్గం బాబు మీద కొంత విమర్శలు చేస్తూ వచ్చింది. సోము వీర్రాజు లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు బాబుపైన ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టేవారు. బాబుకు మద్దతుగా నాటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు వంటి వారు ఉండేవారు. మంత్రుల్లో కామినేని శ్రీనివాస్ అచ్చం టీడీపీ మంత్రిగానే వ్యవహరించేవారు. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా బాబు బీజేపీలోని రెచ్చగొట్టుడు బ్యాచ్ నోటికి జాగ్రత్తగా తాళాలు వేయించేశారు. ఢిల్లీ స్థాయి నేతల ద్వారా చెప్పించి ఏపీ బీజేపీ నేతలను కంట్రోల్లో పెట్టేవారు. మరి జగన్ కి అది సాధ్యమయ్యే పనేనా అన్నది చర్చగా ఉంది. జగన్ కి బీజేపీతో నేరుగా స్నేహం లేదు. తెరచాటు స్నేహాలను పట్టించుకునే రకాలు కాదు బీజేపీ నేతలు. జగన్ ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు ఏపీ బీజేపీ నేతల మీద ఫిర్యాదు చేశారని ప్రచారం అయితే ఉంది. మరి అక్కడ నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ వచ్చినట్లుగా లేదు. కన్నా లక్ష్మీనారాయణ నుంచి అంతా జగన్ ని వదలకుండా విమర్శలతో దులిపేస్తున్నారు.

మేము మీకు, మీరు మాకు….

అని ఏపీ బీజేపీ నేతలకు కొత్త ఆఫర్ ఇస్తున్నారు వైసీపీ నేత సి రామచంద్రయ్య. మేము కేంద్రంతో దోస్తీగా ఉంటున్నాం, దేశ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం, మోడీ సర్కార్ చేసే మంచిపనులకు పూర్తిగా అండగా ఉంటున్నాం, మీరు కూడా ఏపీలో జగన్ సర్కార్ చేసే మంచి పనులకు అండగా ఉండండి, రాజకీయం చేయాలని చూడకండి అంటూ దాదాపుగా రామచంద్రయ్య వేడుకుంటున్నారు. మేము అధికారేంలోకి వచ్చి గట్టిగా మూడు నేలలు కూడా కాలేదు, పైగా మా ముందు వున్న సమస్యలు బాబు వారసత్వంగా ఇచ్చినవి, ఏపీలో ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. ఈ సంగతులు అన్నీ తెలిసి కూడా కొత్త ప్రభుత్వాన్ని తప్పుపట్టడం బీజేపీకి మంచీది కాదు అని రామచంద్రయ్య చెప్పడంలో అర్ధం ఉంది కూడా. ఏపీ బీజేపీ నేతలు టీడీపీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారని, దాని వల్ల లాభపడేది చంద్రబాబు మాత్రమేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఏపీ బీజేపీ నేతలు వైసీపీ నేతల వాదన వింటారా అన్నది పెద్ద ప్రశ్న. వారు వినరన్నది ఇప్పటికే తేలిపోతొంది. అందువల్ల వైసీపీ బీజేపీని మిత్రపక్షమో, శత్రుపక్షమో ముందు ఏదో ఒక క్లారిటీకి రావడం మంచిదేమో.

Tags:    

Similar News