ఆ కల నెరవేరబోతోందా..?

బీజేపీ అన్నది 1980లో పుట్టింది. దానికి పూర్వరూపమైన జనసంఘ్ 1950లలో ఏర్పాటు అయింది. దాని కంటే ముందు 1925 ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సంఘ్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ [more]

Update: 2019-08-08 17:30 GMT

బీజేపీ అన్నది 1980లో పుట్టింది. దానికి పూర్వరూపమైన జనసంఘ్ 1950లలో ఏర్పాటు అయింది. దాని కంటే ముందు 1925 ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సంఘ్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ కి రాజకీయ అంగమే జనసంఘ్. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన నెహ్రూ మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆయనకు నెహ్ర్యూ కాశ్మీర్ మీద అవలంబించిన తీరు నచ్చక రాజీనామా చేశారు. ఆ తరువాత కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి వద్దని డిమాండ్ చేస్తూ కాశ్మీర్ వెళ్ళి పోరాటం చేశారు. నాటి పాలకులు ఆయన్ని అక్కడ జైలులో పెట్టి అక్రమంగా నిర్భందించారు. చివరికి ఆయన అనుమానాస్పద స్థితిలో 1853 జూన్ 23న మరణించారు. ఆయన కల కాశ్మీర్ ఇండియాలో కలపడం. అది ఆయన రాజకీయ వారసుడు మోడీ నేరవేర్చారు. ఇక ఆర్ఎస్ఎస్ కల ఒకటి ఉంది. అదేంటి అంటే బీజేపీ దేశాన్ని ఏలాలని, ఆ కల ఇప్పటికి రెండు సార్లు నెరవేరింది. ఇపుడు ఇంకో కల ఉంది. అదేంటి అంటే కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ కనీసంగా యాభై ఏళ్ళ పాటు ఈ దేశాన్ని ఏలాలని. దాని వల్ల కాంగ్రెస్ చేసిన తప్పులన్నీ కడగడంతో పాటు, దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన శక్తి వస్తుందన్నది బీజేపీ ఆలోచన.

కలసివస్తున్న రాజకీయం….

దేశంలో ఇపుడు రాజకీయం చూస్తే ఆ దిశగానే బీజేపీకి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ కునారిల్లిపోయింది. ఆ పార్టీకి గాలికి వదిలేశారు. రాహుల్ గాంధీ ఎపుడో రాజీనామా చేశారు. సోనియాగాంధి అనారోగ్యం, వృధ్ధాప్యంతో ఉన్నారు. ప్రియాంకాగాంధికి పెద్దగా అవకాశాలు లేవు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పని అయినట్లేనని అంటున్నారు. కాశ్మీర్ విభజన అన్న అంశం చర్చకు వచ్చినపుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో పరువు పోగొట్టుకుంది. కాశ్మీరీల పేరుతో ముస్లిం ఓటు బ్యాంక్ కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ చేసిన దివాళాకోరు పాలిటిక్స్ దేశంలోని ఎనభై శాతం పైగా ఉన్న హిందువులకు ఆగ్రహం కలిగిస్తోంది. అది కాంగ్రెస్ గ్రహించలేకపోతోంది. ఇక కాంగ్రెస్ లోని నాయకులే కాశ్మీర్ విభజనకు మద్దతు ఇస్తున్నారంటే ఆ పార్టీ దీన స్థితి అర్ధమవుతోంది.

కకావికలమేనా…?

ఇక మిత్రులు సైతం కాంగ్రెస్ ని వదిలేశారు.అందుకు రాజ్యసభ సాక్ష్యం. అక్కడ మెజారిటీ లేకపోయినా బీజేపీ బిల్లులు చాలా సులువుగా పాస్ అవుతున్నాయి. దశా దిశా లేని కాంగ్రెస్ విధానాలను దేశమంతా ఇపుడు చూస్తోంది. కశ్మీర్ అంశంలొ బీజేపీ ఉచ్చులో చిక్కుకుంది కాంగ్రెస్. కాశ్మీర్ మనదై ఈ దేశంలోని సగటు పౌరుడు అంటున్నారు. అలాంటిది అది అంతార్జాతీయ సమస్య అంటూ కాంగ్రెస్ నిండు పార్లమెంట్ లో అంటున్నపుడే ఇక్కడ జనంతోనూ, వారు వేసే ఓట్లతోనూ బంధం తెంపేసుకుంది. బీజేపీ కాశ్మీర్ మనది, ఇది దేశ అంతర్గత సమస్య అని గట్టిగా చెబుతూ దేశ ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఇక ఈసారి కాంగ్రెస్ ఎన్నికల్లో వచ్చే ఆ సీట్లు కూడా రావన్న విశ్లేషణ కూడా మొదలైంది. అదే సమయంలో బీజేపీ మరిన్ని టెర్మ్ లు గెలిచేందుకు పావులు వేగంగా కదుపుతోంది. బీజేపీ చేతిలోనే దేశానికి భద్రత అన్న అంశం మీద జరిగిన తాజా ఎన్నికల్లో బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఇపుడు కాశ్మీర్ అంశం సెటిల్ చేసిన బీజేపీ అమ్ముల పొదిల ఉమ్మడి పౌర స్మ్రుతి, రామ మందిరం ఉన్నాయి.ఈ అయిదేళ్ళలో వాటిని కూడా నెరవేర్చేసి బీజేపీ 2024లో మళ్ళీ గెలిచేందుకు రెడీగా ఉంది. కాంగ్రెస్ ఇపుడు జనాల్లో దోషిగా మారుతోంది. ఇదంతా తాను చేసుకున్నదే మరి.

Tags:    

Similar News