బాబు దువ్వుతున్నప్పటికీ..?

కాలం ఎపుడూ ఒకేలా ఉండదు, అది చేసే మ్యాజిక్ వేరుగా ఉంటుంది. 2014లో జరిగినట్లుగా 2019లో జరగలేదు, ఇక 2024లో కూడా మరోలా జరగవచ్చు. కానీ 2014ని [more]

Update: 2019-10-26 08:00 GMT

కాలం ఎపుడూ ఒకేలా ఉండదు, అది చేసే మ్యాజిక్ వేరుగా ఉంటుంది. 2014లో జరిగినట్లుగా 2019లో జరగలేదు, ఇక 2024లో కూడా మరోలా జరగవచ్చు. కానీ 2014ని రిపీట్ చేయాలని ఎన్నికల్లో ఓడిపోయిన రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించి ఫీలర్స్ కూడా ఆయన పంపుతున్నారు. 2014 ఎన్నికల్లో కుడి ఎడమలుగా పవన్, మోడీలను పెట్టుకుని ఎన్నికల రణక్షేత్రంలో గెలిచిన చంద్రబాబుకు 2019లో చుక్కలు కనిపించాయి. దానికి కారణం అటు మోడీతో గొడవ, ఇటు పవన్ తో పడక అన్నట్లుగా టీడీపీ తయారవడమే. అయితే వెంటనే వాస్తవాన్ని గ్రహించిన చంద్రబాబు ఈసారి మాత్రం ఈ రెండు పార్టీలను కలుపుకుని వెళ్ళాలని బలంగా అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా అ రెండు పార్టీలను దువ్వడం ఇప్పటినుంచే మొదలెట్టేశారు కూడా.

టీడీపీ టార్గెట్ గా……

అయితే బీజేపీ ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఎదగాలంటే వారికి అతి పెద్ద అడ్డంకి టీడీపీ అన్న సంగతి ఇప్పటికి బోధపడిందట. నిజానికి బీజేపీ 1980లో ఏర్పాటైంది. మరో మూడేళ్ళకు టీడీపీ పుట్టింది. ఈ మూడేళ్ళ కాలం చూసుకుంటే అప్పటి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉమ్మడి ఏపీలో బీజేపీ సత్తా చూపింది. పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలవడంకానీ, విశాఖ మేయర్ సీటు సాధించడం కానీ హైదరాబాద్ లో గట్టిగా నిలబడడం కానీ ఇలా ఏవిధంగా చూసుకున్నా బీజేపీ బలమే అప్పట్లో కనిపించింది. టీడీపీ వచ్చాకనే బీజేపీ మరీ తగ్గిపోయింది. ఆ తరువాత గత నలభయ్యేళ్ళుగా చూసుకున్నా కూడా తోక పార్టీగానే ఉంటూ వచ్చింది. దాంతో టీడీపీని దెబ్బ తీస్తేనే తప్ప ఏపీలో ఎత్తిగిల్లడం జరగదు అన్న సత్యాన్ని ఎట్టకేలకు బీజేపీ గ్రహించింది అంటున్నారు.

యాంటీ కాంగ్రెస్ సిధ్ధాంతం…

ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే బీజేపీ, టీడీపీలవి యాంటీ కాంగ్రెస్ సిధ్ధాంతం. ఇక బలమైన కోస్తా కమ్మ సామాజికవర్గం రెండు పార్టీల ఎదుగుదలకు ఆలంబన. మరో వైపు చూసుకుంటే వైసీపీ ఉన్న ఆ ఓటు బ్యాంక్ పూర్తిగా కాంగ్రెస్ నుంచి వచ్చినది మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, ఇలాంటి వర్గాలు అన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళడానికి అవకాశం లేదు, మరో వైపు రెడ్లు కూడా కాంగ్రెస్ తరువాత వైసీపీని ఎంచుకున్నారు. టీడీపీలో కమ్మల ఆధిప‌త్యం కారణంగా వారు ఈ వైపు వచ్చే అవకాశం లేదు. దాంతో టీడీపీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని తమవైపు తిప్పుకుంటే ఏపీలో పాగా వేయడం సులువు అవుతుందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. మరో వైపు చూసుకుంటే టీడీపీని నమ్ముకున్న సామాజికవర్గాలకు బీజేపీయే ఆధారంగా కనిపిస్తోంది. వైసీపీ వైపు ఈ వర్గాలు ఎటూ పోలేవు. దీనికి తోడు టీడీపీకి నాయకత్వ సమస్య ఉంది. మామా, అల్లుళ్ళ జమానా తరువాత టీడీపీలో మూడవ తరానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరాదన్నది ఆ పార్టీ పెద్దల‌ ఆలోచనగా ఉంది. అందువల్ల ముందు ఏపీలో ఎలిమినేట్ చేయాలనుకుంటున్నది టీడీపీయేనని అంటున్నారు. మరి కమలనాధుల అంచనాలు ఫలిస్తే మాత్రం ఏపీ రాజకీయ తెర మీద నుంది టీడీపీ వానిష్ కావడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News