ఫోకస్ కు ఫిక్స్

తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో భారతీయ జనతా పార్టీవెళుతుంది. ఒకే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. తెలంగాణ విమోచనదినోత్సవం పేరిట వచ్చే [more]

Update: 2019-08-16 18:29 GMT

తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో భారతీయ జనతా పార్టీవెళుతుంది. ఒకే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. తెలంగాణ విమోచనదినోత్సవం పేరిట వచ్చే నెల 17వ తేదీన భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారని పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. విమోచన దినోత్సవం ఏటా జరుపుతామని ఉద్యమ సమయంలో ప్రకటించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే మాట మార్చారని బీజేపీ చెబుతోంది.

వచ్చే నెల 17వ తేదీన……

తెలంగాణ విమోచన దినాన్ని పెద్దయెత్తున జరపాలని బీజేపీ నిర్ణయించింది. సెప్టెంబరు 17వ తేదీన జరిగే ఈ కార్యక్రమం వేదిక ఇంకా ఖరారు కాలేదు. నిజామాబాద్ లో జరిగే అవకాశముంది. ఈ సభకు అమిత్ షా రానుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సెంటిమెంట్ ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా కన్పిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనం కావడంతో ఆ స్పేస్ ను ఆక్రమించాలన్నది బీజేపీ ఆలోచన.

చేరికల కోసం….

ఇక ఈనెల 18వ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా రానున్నారు. ఈ సభకు తొలుత అమిత్ షా రావాల్సి ఉన్నా ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన రావడం లేదు. ఈ సభలో పెద్దయెత్తున చేరికలు ఉండే అవకాశముంది. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావురావుతో పాటు నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలు పార్టీలో చేరనున్నారు.

ప్రతి నెల కేంద్ర మంత్రులు….

దీంతోపాటు ప్రతి నెల నలుగురు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించేలా క్యాలండర్ ను రూపొందించారు. క్యాడర్ లో జోష్ నింపడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా వీరి పర్యటనలు ఉండనున్నాయి. ప్రతినెలా కేంద్ర మంత్రి తెలంగాణకు వచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నారు. ఇలా ప్రత్యేకంగా తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయింది.

Tags:    

Similar News