కుదిరితే… కుదురుకుందామనే…?

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్న బీజేపీ ఈ క్రమంలో ముందు తెలంగాణ త‌ర్వాత ఏపీల‌నే ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఎలాగైనా స‌రే.. 2024 నాటికి ఈ [more]

Update: 2019-07-11 00:30 GMT

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్న బీజేపీ ఈ క్రమంలో ముందు తెలంగాణ త‌ర్వాత ఏపీల‌నే ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఎలాగైనా స‌రే.. 2024 నాటికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కుదిరితే క‌ప్పు కాఫీ అన్న‌ట్టుగా అధికారంలోకి రావ‌డం లేదా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎద‌గ‌డం ఇప్పుడు ఈ రెండు ల‌క్ష్యాల‌నే నిర్దేశించుకున్న ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆ దిశ‌గానే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. తాజాగా అమెరికాలో జ‌రిగిన తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) స‌భ‌ల‌కు బీజేపీ నాయ‌కులు రాం మాధ‌వ్ స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. వాస్తవానికి తానా స‌భ‌ల్లో కీల‌క పొజిష‌న్‌లో ఉన్న వారంతా కూడా ఏపీలోని టీడీపీకి ప‌క్కా అనుచ‌రులు.

అక్కడ వేదికగా….

అయితే, ఏపీలో పావులు క‌ద‌ప‌డంతోపాటు, ఇక్కడ బ‌ల‌మైన ప‌క్షంగా ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న బీజేపీ పెద్దలు తానా వేదిక‌గా త‌మ వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తానా స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఏపీలో తాము చేస్తున్న అభివృద్దిని, రాబోయే రెండేళ్లలో తాము ఏపీకి చేయాల‌ని నిర్ణయించుకున్న ల‌క్ష్యాల‌ను కూడా వారు ఏక‌రువు పెట్టారు. ఇదే స‌మ‌యంలో తానా స‌భ‌ల‌కు హాజ‌రైన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బీజేపీ కీల‌క నాయ‌కుడు రాం మాధ‌వ్ గంట‌కు పైగా చ‌ర్చలు నిర్వహించిన‌ట్టు ఆయ‌నే స్వయంగా చెప్పారు. రాష్ట్రంలో బ‌ల‌మైన వైసీపీ అధికారంలో ఉంది. నిన్న మొన్నటి వ‌ర‌కు బ‌లంగానే ఉన్న టీడీపీ అధికారం కోల్పోయింది.

అసంతృప్తులందరినీ….

దీంతో టీడీపీలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. అదేస‌మ‌యంలో సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకున్నా.. కాపు వ‌ర్గం టీడీపీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం అందుతోంది. ఈ ప‌రిణామాల‌ను బేరీజు వేసుకున్న క‌మ‌ల నాధులు అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్‌ను త‌మ వైపు తిప్పుకోగ‌లిగే.. ఏపీలో తిరుగులేని శ‌క్తిగా ఎదిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ పార్టీని త‌మ‌లో విలీనం చేసుకోవ‌డం లేదా.. త‌మ‌కు మిత్రప‌క్షంగా మార్చుకునే విష‌యంపై జ‌న‌సేనానితో చ‌ర్చలు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ప‌వ‌న్ కూడా బీజేపీ విష‌యంలో స్పష్టత‌ను ఇచ్చారు.

పవన్ కూడా సానుకూలంగా….

బీజేపీతో త‌న‌కు ఎలాంటి వైరం లేద‌ని, కేవ‌లం హోదాపైనే వారిని గ‌తంలో ప్రశ్నించాన‌ని అన్నారు. అంతేకాదు, ఏపీ ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ఆకాంక్ష లేన‌ప్పుడు హోదా విష‌యం నేను మాత్రం ఏం చేయ‌గ‌ల‌ను అంటూ.. ఆయ‌న హోదాపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌ట్టును చేజార్చారు. మొత్తంగా చూస్తే.. దాదాపుగా ప‌వ‌న్‌ను క‌మ‌ల నాథులు త‌మ వైపు తిప్పుకొనే ప్రయ‌త్నంలో స‌క్సెస్ అయ్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాబోయే రోజుల్లో ఈ ప‌రిణామం మ‌రింత బల‌ప‌డితే.. వినూత్న రాజ‌కీయాల‌కు వేదిగా ఏపీ మార‌డంతోపాటు బీజేపీ ప్రత్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు కూడా ఏపీ వేదిక‌గా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News