ఐదింటిలో అదొక్కటేనా? అది కూడా అనుమానమే?

ఈ ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఐదు [more]

Update: 2021-01-29 16:30 GMT

ఈ ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించే రాష్ట్రాలు ఏమీ లేవనే చెప్పాలి. అసోం ఒక్కటే కమలనాధుల్లో ఆశ. అందుకే కొంత హోప్స్ ఉన్న పశ్చిమ బెంగాల్ పై బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అతి పెద్ద రాష్ట్రం కావడం, ఇప్పటికే బీజేపీ కొంత బలం పెంచుకోవడంతో అక్కడే తమ బలగాలను ఎక్కువగా మొహరించాలని నిర్ణయించింది.

దక్షిణాదిన రెండు…..

తమిళనాడులో బీజేపీకి అవకాశాలు లేవు. అక్కడ అన్నాడీఏంకే కూటమిలో ఉండటం, ఆ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో అక్కడ ఆశలు వదులుకున్నట్లే. పుదుచ్చేరిలో కొంత అవకాశాలు కన్పిస్తున్నా అతి చిన్న రాష్ట్రం. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేత బీజేపీ కథ నడిపిస్తుంది. ఇక్కడ అధికారంలోకి వచ్చినా బీజేపీ నేత ముఖ్యమంత్రి కాలేరు. ఇక అసోం ఒక్కటే ఆశాకిరణంగా కన్పిస్తుంది. ఇక్కడ గెలుపు అవకాశాలున్నాయి.

కేరళలో వేలు పెట్టలేక…..

కేరళ వి‍షయానికొస్తే అక్కడ వేలు కూడా పెట్టలేని పరిస్థితి. అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లోనే బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి డబుల్ డిజిట్ రావడం కూడా బీజేపీకి కష్టమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్ లో విజయం సాధించి దేశ వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ తగ్గలేదని నిరూపించాలని కమలనాధులు కసరత్తులు ప్రారంభించారు.

అందుకే బెంగాల్ పై….

ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే కంటే ముందుగానే అభ్యర్థులను నిర్ణయించాలని బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీలో చేరారు. మరో 41 మంది ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు. వీరంతా చేరిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. అమిత్ షా పర్యటన కూడా త్వరలోనే ఇక్కడ ఉండనుంది. గెలుపు అవకాశాలపై సర్వేను నిర్వహించిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో తప్పించి బీజేపీకి మరెక్కడా అవకాశం లేదన్నది వాస్తవం. అదీ కూడా గ్యారంటీ లేదు.

Tags:    

Similar News