పరువు పోకుండా సెంటిమెంట్ ను వాడేసి?

ప్రభుత్వాన్ని కూల్చి వేసి అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం ఒక సవాల్. తిరిగి ప్రభుత్వం కూలిపోయిందంటే పరువు మొత్తం గంగలో కలసినట్లే. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా [more]

Update: 2020-09-12 16:30 GMT

ప్రభుత్వాన్ని కూల్చి వేసి అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం ఒక సవాల్. తిరిగి ప్రభుత్వం కూలిపోయిందంటే పరువు మొత్తం గంగలో కలసినట్లే. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. మధ్యప్రదేశ్ లో జరిగే 27 శాసనసభ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ఇప్పుడు దాని ముందున్న లక్ష్యం. ఏమాత్రం చేజారిపోయినా తిరిగి మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రత్యర్థి చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే బీజేపీ అన్ని రకాల చర్యలు ప్రారంభించింది.

పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండి……

మధ్యప్రదేశ్ లో బీజేపీ పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలతో రాష్ట్రాన్ని చేజార్చుకుంది. కాంగ్రెస్ పరమయింది. అయితే పదిహేను నెలల కాంగ్రెస్ పాలన తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది. కాంగ్రెస్ లో చెలరేగిన అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ లో చేరడంతో మధ్యప్రదేశ్ లో తిరిగి కాషాయ జెండా ఎగిరింది. అయితే పార్టీలో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడంతో ఉప ఎన్నిలకు అనివార్యమయ్యాయి.

ఉప ఎన్నికల్లో విజయం కోసం….

మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం 27 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అన్నీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే. వీటిలో అత్యధిక స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం స్థానాలు తగ్గినా శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం కూడా ప్రత్యేక ప్రణాళికను రచిస్తుంది. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు శివరాజ్ సింగ్ కు కూడా ప్రత్యేక టాస్క్ లను ఇస్తుంది. గత పదిహేనేళ్ల నుంచి మధ్యప్రదేశ్ లో జరిగిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పదిహేనేళ్లలో రాష్ట్రంలో చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.

సెంటమెంట్ ఆయింట్ మెంట్ పూసి…..

మరోవైపు ప్రజలను సెంటిమెంట్ తో దగ్గరవ్వాలని బీజేపీ చూస్తుంది. అయోధ్యలో జరగనున్న రామాలయ నిర్మాణానికి ఇటుకలను సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం బీజేపీ రధయాత్ర చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రజల నుంచి సేకరించిన ఇటుకలను అయోధ్య తరలించడానికే ఈ రధయాత్ర చేపట్టనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితుడు గోవింద్ రాజ్ పుత్ ఈ రధయాత్ర చేపట్టనున్నారు. ఇలా సెంటిమెంట్, అభివృద్ధి కలగలిపి ప్రచారం చేసి ఎక్కువ స్థానాలను గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. మరి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News