ఇక్కడ గెలవకుంటే బలహీనపడినట్లేనా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒక్క అసోం మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. ఈసారి అదనంగా [more]

Update: 2021-03-31 17:30 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒక్క అసోం మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. ఈసారి అదనంగా ఒక్క రాష్ట్రంలోనైనా అధికారంలోకి వచ్చి పార్టీని విస్తరించాలన్న యోచనలో బీజేపీ ఉంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది అంత తేలిక కాదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకోవడం బీజేపీ అత్యాశే అవుతుంది. కేంద్ర పాలిత ప్రాంతమై పుదుచ్చేరిలో మాత్రం కొంత సానుకూల పరిస్థితులు ఉన్నాయంటున్నారు.

అసోంలోనూ కష్టమేనా?

పుదుచ్చేరిలో కాంగ్రెస్ మొన్నటి వరకూ అధికారంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ లో విభేదాలు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చెప్పలేం. ఇక అసోంలో బీజేపీయే అధికారంలో ఉంది. అధికార పార్టీ కావడంతో సహజంగానే బీజేపీ పై వ్యతిరేకత ఉంటుంది. అయితే పౌరసత్వ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తీసొచ్చిన సవరణలు అసోంలో బీజేపీ విజయానికి అడ్డంకిగా మారాయంటున్నారు.

తీసిపారేయడానికి లేదు…..

ఐదు రాష్ట్రాలని తీసిపారేయడానికి లేదు. తమకు బలం లేకపోయినా భవిష్యత్ ఉండాలంటే ఈ ఐదు రాష్ట్రాల్లో సరైన పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు '116 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే భవిష‌్యత్ లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కీలకంగానే చెప్పాలి. తమ ప్రభుత్వ పనితీరుపై ఈ ఎన్నికల ప్రభావం ఉండనుందని బీజేపీ భావిస్తుంది.

రెండింటిపైనే ఆశలు…..

ఈ ఐదు రాష్ట్రాల్లో అసోం, పశ్చిమ బెంగాల్ లపైనే బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ లో సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. అయితే ఇక్కడ కూడా బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. దేశ జనాభాలో ఐదో వంతు ప్రజలు ఇచ్చే తీర్పు మోదీ సర్కార్ పై ఖచ్చితంగా ప్రభావం చూపనుంది. అందుకే ఈ ఎన్నికలను మోదీ, అమిత్ షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News