గెలుపు గుర్రం ఎక్కడం సాధ్యమవుతుందా?

బీహార్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇటీవల సమావేశమై చర్చించారు. బీహార్ ఎన్నికల్లో గెలుపునకు [more]

Update: 2020-10-17 17:30 GMT

బీహార్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇటీవల సమావేశమై చర్చించారు. బీహార్ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ కు ఈ నెలాఖరునుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వ్యూహాలపై మోదీ, అమిత్ షా లు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

వన్ సైడ్ గా మాత్రం……

బీహార్ ఎన్నికలు వన్ సైడ్ గా ఏమీ లేవు. విపక్షాలు కూడా బలంగా ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లడంతో ఆయనపై ఉన్న సానుభూతి ఒక సామాజికవర్గంలో బాగా పనిచేసే అవకాశముంది. గత ఎన్నికల్లోనూ ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా బీహార్ లో అవతరించింది. అయితే ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదన్నది బీజేపీ లక్ష్యం. ప్రధానంగా ఈబీసీలను ప్రసన్నం చేసుకోవడంపై వీరు దృష్టి పెట్టినట్లు తెలిసింది.

కొన్ని సామాజికవర్గ ఓట్లు…..

ఇటీవల లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లి స్వతంత్రంగా పోటి చేస్తుంది. అది అన్ని స్థానాల్లో పోటీ చేయకపోయినా తమకు బలమున్న స్థానాల్లో పోటీకి దిగుతుంది. ఇది ఖచ్చితంగా తమకు ఇబ్బంది కరమేనన్నది బీజేపీ నేతల అంచనా. అందుకే వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీని దగ్గరకు తీసుకున్నారు. ఈ పార్టీకి 11 స్థానాలను బీజేపీ కేటాయించింది. అయితే దీనివల్ల ఎంత వరకూ ఉపయోగం అనేది ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి.

ప్రధాని ప్రచారంతో……

ఇక తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని మాత్రమే బీజేపీ ప్రకటించింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని స్పష్టం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 20 సభలతో ప్రచారం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. కోవిడ్ నిబంధలను అనుసరిస్తూ ప్రధాని మోదీ పర్యటనలకు ఏర్పాటు చేయాలని ఇప్పటికే బీహార్ బీజేపీ శాఖకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News