చితక్కొట్టించుకునేదెవరు?

బలం లేని ఆంధ్రప్రదేశ్ లో సత్తా చాటాలంటే రెండు బలమైన పార్టీలను క్లిన్ బౌల్డ్ చేయాలి. ఇప్పుడు బిజెపి లక్ష్యం అదే. భారీ మెజారిటీ తో అధికారంలో [more]

Update: 2019-12-08 08:00 GMT

బలం లేని ఆంధ్రప్రదేశ్ లో సత్తా చాటాలంటే రెండు బలమైన పార్టీలను క్లిన్ బౌల్డ్ చేయాలి. ఇప్పుడు బిజెపి లక్ష్యం అదే. భారీ మెజారిటీ తో అధికారంలో వున్న వైసీపీ ని ఎదుర్కోవాలి. ఆపార అనుభవంతో దశాబ్దాల రాజకీయ చరిత్ర వున్న చంద్రబాబు పార్టీని మట్టికరిపించాలి అంటే సామాన్య విషయం కాదు. కానీ పటిష్టమైన వ్యూహంతో కేంద్రంలో తమ పార్టీ ఇచ్చే అండతో వీరిద్దరిని చితక్కొట్టడం పెద్ద పనేమీ కాదన్న నమ్మకంతో బిజెపి అడుగులు వేస్తుంది. కాషాయం వ్యవహారాలు ఇప్పుడు ఇదే అంశాన్ని సూచిస్తున్నాయి.

కన్నా లేఖ వెనుక …

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఒక లేఖ రాశారు. ఈ లేఖలో వున్న ప్రధాన అంశాలు అధికార, విపక్ష పార్టీలను ఇరుకునపెట్టేవే. గత ఎన్నికలకు ముందు డేటా చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్ట్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా వున్న ఐటి గ్రిడ్ అశోక్ కు నాటి టిడిపి సర్కార్ అండగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో వున్న పౌరుల డేటా అంతా తస్కరించి టిడిపి వ్యతిరేకుల ఓట్లు తొలగించడమే నాటి డేటా గ్రిడ్ వ్యవహారంలో ప్రధాన లక్ష్యం. దీనిపై నాడు టీఆర్ఎస్ ఒకవైపు వైసిపి ఇతర విపక్షాలు నానాగోలా చేశాయి. ఈ కేసు లో ప్రధాన నిందితుడు అశోక్ మాయం అయ్యారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ సైతం ఎన్నికల ప్రచార సభల్లో ఈ అంశాన్ని ప్రముఖంగానే ప్రస్తావించారు కుడా. ఎన్నికలు ముగిసాయి. తెలుగు రాష్ట్రాల్లో అటు టీఆరెస్ మళ్ళీ అధికారంలోకి రాగా వైసిపి దుమ్ము లేచే మెజారిటీ తో పగ్గాలు చేపట్టింది. అయితే ఆ తరువాత ఈ కేసును రెండు అధికార ప్రభుత్వాలు పక్కన పెట్టేసినట్లు వారి చర్యలు సూచించాయి. టిడిపి ఇరుకున పడే ఈ వివాదాన్ని తిరిగి తెరపైకి తేవాలని ఇప్పుడు బిజెపి రంగంలోకి దిగింది. తద్వారా అటు కెసిఆర్ సర్కార్ ఇటు వైసిపి ని ఇబ్బందుల్లో పెట్టొచ్చన్నది బిజెపి వ్యూహం. ఈ మూడు పార్టీలు ఒకే తరహావన్న అభిప్రాయాన్ని ప్రజల్లో ప్రచారం చేయడం కూడా కమలం ఆలోచన గా కనిపిస్తుంది.

వైఎస్ వివేకా కేసులోనూ …

సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ వివేకా హత్య సంచలనం సృష్ట్టించింది. ఈ కేసు పై టిడిపి, వైసిపి, జనసేన వాడి వేడి ఆరోపణలు విమర్శలు గుప్పించుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో వైసిపి వుంది. ఆరునెలలు గడిచినా కేసులో పెద్దగా పురోగతి లేదు. ఇది కూడా అధికార పార్టీని ఇబ్బంది పెట్టె అంశమే. అందుకే ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని బిజెపి అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ కోరడం విశేషం. తద్వారా టిడిపి – వైసిపి జుట్టు తమ చేతుల్లోకి తెచ్చుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహమని చెప్పకనే చెప్పారు. మరి ఈ రెండు కేసుల్లో వైసిపి ఎలాంటి ప్రతి వ్యూహం రచిస్తుందో చూడాలి.

Tags:    

Similar News