గీతను దాటేసేటట్లుందే…??

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. [more]

Update: 2019-07-02 18:29 GMT

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. బీజేపీలో కూడా లక్షణ రేఖలు చాలానే ఉన్నాయి. అయితే అవి అందరికీ వరిస్తాయా అన్నదే డౌట్. మోడీ 2014లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చినపుడు సీనియర్ మోస్ట్ లీడర్, తన రాజకీయ గురువు అద్వానీకి తగిన ప్లేస్ మెంట్ చూపించాల్సివచ్చింది. గురువును పక్కన పెట్టుకుంటే రాజకీయాల్లో ఏమైనా ఉందా. అందుకే తప్పించేందుకు అన్నట్లుగా ఓ గీత గీసేశారు. అదే లక్షణ రేఖగా మరింది పార్టీలో సీనియర్ మోస్ట్ సిటిజన్స్ అంటే 75 ఏళ్ళు పైబడిన వారికి మంత్రి పదవులు, కీలకమైన బాధ్యతలు అప్పగించరాదని మోడీ షా నిర్ణయించేశారు. దాని ప్రకారం అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హా వంటి వారు అధికారానికి దూరమైపొయారు.

ఇక పోటీకి సైతం దూరమే….

ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికలో టికెట్ కూడా సీనియర్లకు ఇవ్వరాదని రూల్ చేసి పారేశారు. ఆ విధంగా అద్వాని పోటీకి కూడా కాకుండా పోయారు. ఆయనతో పాటే మిగిలిన సీనియర్లూ పార్లమెంట్ ముఖం చూడకుండా ఇంటి పట్టునే ఉండాల్సివచ్చింది. ఈ రూల్ పాస్ చేసిన మోడీ వయసు ఇపుడు 68 ఏళ్ళు, అమిత్ షా వయసు 55 ఏళ్ళు. ఇక మరో అయిదేళ్లు ఎటూ మోడీ అవకాశం ఉంది. 2024 తరువాత తాను పెట్టి రూల్ ప్రకారం మోడీ కూడా పోటీకి అనర్హులు అయిపోతారు. ఆయన కూడా 75కి చేరువ అయిపోతారు. అమిత్ షాకి అయితే మరో పదిహేనేళ్ళ టైం ఉంటుంది. కానీ రాజకీయ చాణక్యుడు అయిన మోడీ మూడవసారి ప్రధాని కాకుండా ఉంటారా.

అందుకేనా ముందస్తు….

మోడీ మాస్టర్ ప్లాన్ ఇపుడు బయటకు వస్తోంది షెడ్యూల్ ప్రకారం 2024లో కేంద్రంలో ఎన్నికలు జరగాలి. అయితే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటూ మోడీ ఇపుడు కొత్త నినాదం అందుకున్నారు. దాని ప్రకారం లోక్ సభ ఎన్నికలను రెండేళ్ళ ముందుకు తీసుకువస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా తాను 75 ఏళ్లకు చేరువ కాక ముందే ముచ్చటగా మూడవసారి ప్రధాని పీఠం ఎక్కేందుకు మోడీ గట్టి వ్యూహమే రచించారని బీజేపీలో చర్చ సాగుతోంది 2023 నాటికి మోడీకి 72 ఏళ్ళే వస్తాయి. అంటే పార్టీ నిర్ణయం ప్రకారం ఆయన పోటీ చేయవచ్చు, ప్రధానిగా కూడా పాలించవచ్చు.

గీత దాటకుండా….

అందువల్ల ఆయన తెలివిగా ఎన్నికలను ముందుకు తెస్తున్నారని అంటున్నారు. అయితే ప్రధానిగా పీఠమెక్కేనాటికి 72 ఏళ్ళు అయినా దిగిపోయేనాటికి 77 ఏళ్ళు వస్తాయి. అంటే మోడీ గీత దాటినట్లే. మధ్యలో మూడేళ్ళు పాలించి దిగిపోతారా మోడీ అంటే అది కుదిరే వ్యవహారం కాదని చెప్పొచ్చు. అంటే మోడీ గీతలన్నీ అద్వానీ వంటి వారి మీదనే అన్న మాట. తాను బలంగా ఉన్నాను, ప్రజలు కూడా కోరుకుంటున్నారంటూ చెప్పి మోడీ ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News