మైండ్ గేమ్ మొదలెట్టారా?

తెలుగుదేశం పార్టీ గొప్పదని, నలభయ్యేళ్ళ చరిత్ర ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు గాలిని బీజేపీ నేతలు తీసేస్తున్నారు. ఏపీలో ఉన్నది అసలు తెలుగుదేశం కాదని అంటున్నారు. ఏపీ బీజేపీ [more]

Update: 2019-11-15 03:30 GMT

తెలుగుదేశం పార్టీ గొప్పదని, నలభయ్యేళ్ళ చరిత్ర ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు గాలిని బీజేపీ నేతలు తీసేస్తున్నారు. ఏపీలో ఉన్నది అసలు తెలుగుదేశం కాదని అంటున్నారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. చంద్రబాబు పార్టీ నకిలీ అని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులంతా ఇపుడు టీడీపీలోనే ఉన్నారని ఆయన అంటున్నారు. టీడీపీ సిధ్ధాంతాలు చంద్రబాబు గంగలో కలిపేశారని, అన్న ఎన్టీయార్ పెట్టిన పార్టీ ఇపుడు లేదని కూడా ఆయన చెబుతున్నారు. చంద్రబాబు మీద కూడా ఆయన పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా అనైతికమని విష్ణు అంటున్నారు. చంద్రబాబుకు తాము ఆమడ దూరంలో ఎపుడూ ఉంటామని కూడా చెబుతున్నారు.

నాటి పొత్తు సంగతేంటి..?

విష్ణు చేసిన కామెంట్స్ నే పరిగణనలోకి తీసుకుంటే ఎన్టీయార్ మరణించి దాదాపుగా పాతికేళ్ళు అవుతోంది. ఇక చంద్రబాబు టీడీపీ ప్రెసిడెంట్ అయ్యాక ఇప్పటికి రెండు సార్లు ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి విష్ణు మరచిపోయినట్లున్నారని కూడా అంటున్నారు. ఇక 2014 ఎన్నికలకు ముంచు చూస్తే మొత్తానికి మొత్తం కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరారు. వారిని పక్కనే పెట్టుకునే కదా బీజేపీ, టీడీపీ చేయి చేయి కలిపి ఎన్నికలకు వెళ్ళాయి. మరో వైపు చూసుకుంటే చంద్రబాబే అసలు కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు. మరి ఆ సంగతి తెలిసేనా వాజ్ పేయ్ వంటి బీజేపీ దిగ్గజ నాయకులు తమ పక్కన చోటిచ్చి మరీ చంద్రబాబుకు కలుపుకున్నది. రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో నేతలు చేరడం కామన్ అయిపోయిన వేళ టీడీపీకి కాంగ్రెస్ ముద్ర ఎలా వేస్తారని తమ్ముళ్ళు అంటున్నారు.

ఆ ఇద్దరు తప్ప….

ఇన్ని సుద్దులు చెప్పిన విష్ణు టీడీపీ నుంచి ఎవరు వచ్చినా కళ్ళకు అద్దుకుని మరీ బీజేపీలోకి చేర్చుకుంటామని అంటున్నారు. టీడీపీలో అంతా కాంగ్రెస్ నేతలు ఉంటే వారిని బీజేపీలోకి ఎలా తీసుకుంటారు. తీసుకుంటే వారు అచ్చమైన బీజేపీ నాయకులు అయిపోతారా. దీనికి కూడా ఈ యువ బీజేపీ నేత సమాధానం చెబితే బాగుంటుందేమో అంటున్నారు. ఇక టీడీపీ అంటరాని పార్టీ అంటున్నారు విష్ణు. మరి బీజేపీని కూడా కొన్ని దశాబ్దాల పాటు అంటరాని పార్టీ అని అంతా అంటే ఆనాడు రాజకీయాల్లో అంటరానితనం ఏంటి అని పోరాడింది కూడా కమలనాధులే అన్న సంగతిని ఆయన ఎలా మరచిపోతున్నారో కదా అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు. లోకేష్ తప్ప అందరు టీడీపీ నేతలు కావాలని విష్ణు తన పార్టీ మనసులో మాటను బయటపెట్టేశారు. అంటే చంద్రబాబు టీడీపీని హైజాక్ చేద్దామని ఆలోచనతోనోఅ ఇన్ని రాజకీయ నీతులు కాషాయనాయకులు వల్లిస్తున్నారని అర్ధమయ్యాక ఇక వారు చేసే విమర్శలో పస ఏముంటుంది. చంద్రబాబు ఇంతకు ముందు చేసిన దాంట్లో తప్పేముంది అని కూడా అంటున్నారు మరి.

Tags:    

Similar News