తడిసిపోయిందా? జ్వరం పట్టుకుందా?

మహారాష్ట్ర రాజకీయాల్లో అర్థరాత్రి మారిన సమీకరణాలు కేవలం ఆ రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల అధినేతలను షాక్ లోకి నెట్టేశాయి. శరద్ [more]

Update: 2019-11-23 13:30 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో అర్థరాత్రి మారిన సమీకరణాలు కేవలం ఆ రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల అధినేతలను షాక్ లోకి నెట్టేశాయి. శరద్ పవార్ మరాఠా యోధుడిగా పేరుగాంచారు. ఆయన పార్టీని స్థాపించి ఇంత స్థాయికి తీసుకు వచ్చిన సమయంలోనే ఆ పార్టీలో బీజేపీ చీలిక తేవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు, ప్రాంతీయ పార్టీల అధినేతలకు అలెర్ట్ లాంటిదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

మోడీ ఫీవర్….

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మోడీ ఫీవర్ బాగా పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ ఇటీవల ఆ పార్టీ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ ఎంపీలందరూ మూకుమ్మడిగా కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. సాక్షాత్తూ ముఖ్మమంత్రి జగన్ సయితం శత్రువులంతా ఏకమైనా బెదరను అన్న వ్యాఖ్యలు కూడా ఏదో జరుగుతుందన్న సిగ్నల్స్ ను జనంలోకి పంపాయి. ఇలా వైఎస్ జగన్ వత్తిడికి గురవుతున్నారని చెప్పకనే తెలుస్తోంది.

టీడీపీలో వణుకు….

ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సంగతి వేరే చెప్పనక్కర లేదు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటున్నారు. ఇప్పటికే టీడీపీ బీజేపీ దెబ్బకు కుదేలయిపోతుంది. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు అనేక మంది నేతలు బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో మోడీ, షాలు పావులు కదిపిన తీరు చూసిన తర్వాత చంద్రబాబులోనూ వణుకు ప్రారంభమయిందనే చెప్పాలి. ఇప్పటికే తాము సరెండర్ అవుతామని తెలుపు జెండా ఊపినా ఇంకా అక్కడి నుంచి స్పష్టత రాకపోవడంతో చంద్రబాబు వెయిట్ చేస్తున్నారు. బీజేపీ అనుమతిస్తే ఏక్షణంలోనైనా వెళ్లి కలసిపోయేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నారు.

కేసీఆర్ కూడా…..

ఇక్కడ జగన్ ప్రభుత్వం పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్న వ్యవహారం నుంచి బయటపడాలంటే బీజేపీ దన్ను చంద్రబాబుకు అవసరం. అయితే మహారాష్ట్రలో మోడీ ఆడిన గేమ్ చూసిన తర్వాత టీడీపీనేతలకు ఇక్కడ తడి ఆరిపోయిందనే చెప్పాలి. ఇక తెలంగాణలో సయితం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఎదురేలేదనుకున్నా బీజేపీ ఎత్తుగడలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ మహారాష్ట్ర రాజకీయాలు చూసిన తర్వాత బీజేపీతో చెలిమి బెటర్ అన్న కన్ క్లూజన్ కు వచ్చేసినట్లే కన్పిస్తోంది.

Tags:    

Similar News