జగన్ ఇక్కడ శాశ్వతంగా పాగా వేశారా ?

బీజేపీకి ఉత్తరాంధ్ర కావాలి. ఇక్కడ ఉన్న మూడు జిల్లాల్లో పాతుకుపోవాలి. అయిదు ఎంపీ సీట్లు, 34 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఉత్తరాంధ్రా చంద్రబాబుని అనేకసార్లు ముఖ్యమంత్రిని చేసింది. [more]

Update: 2020-12-20 15:30 GMT

బీజేపీకి ఉత్తరాంధ్ర కావాలి. ఇక్కడ ఉన్న మూడు జిల్లాల్లో పాతుకుపోవాలి. అయిదు ఎంపీ సీట్లు, 34 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఉత్తరాంధ్రా చంద్రబాబుని అనేకసార్లు ముఖ్యమంత్రిని చేసింది. ఈసారి వైసీపీకి చోటిచ్చి జగన్ కి చరిత్రలో నిలిచిపోయే గెలుపు ఇచ్చింది. అటువంటి చోట మూడవ పార్టీగా తాను దూసుకుపోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అయితే ఉత్తరాంధ్రా రాజకీయ సామాజిక సమీకరణలు బట్టి చూస్తే ఈ అర్బన్ బేస్డ్ పార్టీకి అంతగా దొరికే సీన్ లేదని విశ్లేషణలు ఉన్నాయి. నూటికి ఎనభై శాతం బీసీలు ఉన్న ఉత్తరాంధ్రాలో బీజేపీ వంటి పార్టీలకు ఆదరణ దక్కాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి అంటున్నారు.

ఆ రెండేనా…?

ఉత్తరాంధ్రాలో ఇప్పటికీ రెండే పార్టీల వ్యవస్థ సాగుతోంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ఉంటే. ఇపుడు ఆ ప్లేస్ లోకి వైసీపీ వచ్చేసింది. వైసీపీకి ఉత్తరాంధ్రాలో చోటు దక్కడానికి కారణం బీసీలు. గత ఎన్నికల్లో వారు తమ రూటు మార్చుకుని గట్టి మద్దతు ఇవ్వడంతో కేవలం ఆరు సీట్లు తప్ప అన్నీ వైసీపీ పరం అయ్యాయి. అలాగే ఒక్కటి తప్ప నాలుగు ఎంపీ సీట్లూ వైసీపీ గెలుచుకుంది. ఇక వైసీపీకి మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి గిరిజనుల మద్దతు కూడా దక్కుతూ వస్తోంది. ఉత్తరాంధ్రాలో వారి సంఖ్య కూడా ఎక్కువ. అలాగే ఎస్సీలు, మైనారిటీల దన్ను కూడా ఉంది. దాంతో టీడీపీని పక్కకు నెట్టి వైసీపీ అలా దూసుకువచ్చేసింది.

పోలరైజేషన్ అలా …?

ఉత్తరాంధ్రాలో బీసీలు విసిగితే మళ్ళీ టీడీపీ వైపే చూస్తారు. రెండేళ్ళ జగన్ పాలన మీద బీసీలు ఇప్పటికైతే సంతృప్తిగానే ఉన్నారు. మొత్తం 56 బీసీ కార్పొరేషన్లను జగన్ ప్రకటిసే అందులో మూడవ వంతు ఈ మూడు జిల్లాలకే దక్కాయి. ఇక అనేక సంక్షేమ పధకాలు కూడా వీరు అందుకుంటున్నారు. దాంతో బీసీల మద్దతు శాశ్వతం చేసుకోవాలని వైసీపీ వేస్తున్న ఎత్తులకు టీడీపీ చిత్తు అవుతోంది. మరి ఇక్కడ బీజేపీకి చోటు దక్కాలంటే వీలు పడే విషయమేనా అన్నది కూడా చూడాలి. ఇక బీసీల్లో కూడా కులాల వారీగా అటూ ఇటూ రెండు పార్టీల మధ్య చీలిపోయి ఉన్నారు. పోలరైజేషన్ అలాగే జరిగిపోయింది.

పట్టు కోసమేనా…?

ఇక ఉత్తరాంధ్రాలో టీడీపీ అసంతృప్తుల మీద, అలాగే వైసీపీలో పదవులు రాక నీర‌సించిన నేతల మీదనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. వారితోనే రాజకీయ జూదం ఆడుతోంది. అయితే బీజేపీని సిధ్ధాంతపరంగా బీసీలు దగ్గరకు తీసుకోలేనితనం ఉందని అంటారు. ఆ పార్టీ అగ్రవర్ణాలదేనని ఒక ముద్ర ఉంది. కానీ ఇపుడు బీసీలకు కూడా పెద్ద పీట వేస్తామని బీజేపీ అంటున్నా నమ్మడానికి చాలా కాలమే పడుతుంది అంటున్నారు. మరో వైపు కాపుల మద్దతు ఉన్న జనసేనతో మైత్రి వల్ల కూడా బీసీలు బీజేపీకి దూరంగా ఉంటున్నారు అన్న విమర్శలూ ఉన్నాయి. మొత్తానికి బీజేపీ ఉత్తరాంధ్రాలో పాగా వేయడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. చూడాలి మరి ఈ రాజకీయం ఎటు వైపు మలుపు తీసుకుంటుందో.

Tags:    

Similar News