రానున్న కాలం గడ్డుదే?

భారతీయ జనతా పార్టీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఏడేళ్లలో ఎన్నడూ రానంత వ్యతిరేకత బీజేపీ ప్రభుత్వంపై ఏర్పడుతోంది. పెట్రోలు ధరలు పెరగడం, నిత్యవాసరాల ధరలు నింగినడటంతోపేద, [more]

Update: 2021-02-11 17:30 GMT

భారతీయ జనతా పార్టీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఏడేళ్లలో ఎన్నడూ రానంత వ్యతిరేకత బీజేపీ ప్రభుత్వంపై ఏర్పడుతోంది. పెట్రోలు ధరలు పెరగడం, నిత్యవాసరాల ధరలు నింగినడటంతోపేద, మధ్య తరగతి ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. మరీ ఉత్తరాదిన బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఈసారి మాత్రం బలహీనపడక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. త్వరలో జరగనున్న పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి పరాభవం తప్పదంటున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో…..

ఇప్పటకే రైతు ఉద్యమం ఉత్తరాదిన అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా బలమైన వారు. వారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దాదాపు రెండు నెలలకు పైగానే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం దిగిరాకపోవడంతో వాళ్లు బీజేపీ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికలలో తమ తడాఖా చూపిస్తామంటున్నారు.

బలంగా ఉన్నామనుకుంటున్నా…..

ఉత్తర్ ప్రదేశ్ లో బలంగా ఉన్నామని బీజేపీ భావిస్తుంది. కానీ ఇక్కడ కూడా రైతు ఉద్యమం ఎఫెక్ట్ పడింది. రాకేశ్ టికాయత్ ప్రభావం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పడుతుందంటున్నారు. ఆయన తండ్రి మహేంద్ర సింగ్ టికాయత్ రైతు నాయకుడిగా పేరుంది. చరణ్ సింగ్ అంతటి నాయకుడిగా పేరు. భారీతీయ కిసాన్ యూనియన్ స్థాపించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా వీరిది. చక్కెర పండించే రైతులు ఇక్కడ ఎక్కువ. జాట్ వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు.

ఆ వర్గం వ్యతిరేకమైతే…?

దీంతో ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో రైతు వర్గం పూర్తిగా వ్యతిరేకం వ్యక్తం చేేేసే అవకాశముంది. రాకేశ్ టికాయత్ నేతృత్వం వహిస్తుండటంతో ఈ ఎఫెక్ట్ ఉత్తర్ ప్రదేశ్ లో రైతులంతా సంఘటితం అవుతున్నారు. ఈ సమస్యను స్మూత్ గా డీల్ చేయకపోతే బీజేపీకి రానున్న ఎన్నికల్లో కష్టాలు తప్పవన్న అంచనాలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద రానున్న కాలం బీజేపీకి అనుకూలంగా మాత్రం ఉండబోవన్నది పరిశీలకుల అభిప్రాయం.

Tags:    

Similar News