చేరికల జోరు ఇక పెరుగుతుందా? కారణమిదేనా?

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి గుర్తింపు నిస్తూ బీజేపీ అధిష్టానం కొత్త వ్యూహానికి తెరలేపింది. తద్వారా బీజేపీలోకి వలసలను పెంచాలన్న ఆలోచనలలో బీజేపీ ఉంది. దక్షిణాదిన కొద్దోగొప్పో [more]

Update: 2020-10-07 09:30 GMT

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి గుర్తింపు నిస్తూ బీజేపీ అధిష్టానం కొత్త వ్యూహానికి తెరలేపింది. తద్వారా బీజేపీలోకి వలసలను పెంచాలన్న ఆలోచనలలో బీజేపీ ఉంది. దక్షిణాదిన కొద్దోగొప్పో బీజేపీకి అవకాశాలున్న రాష్ట్రం కర్ణాటక తర్వాత తెలంగాణ మాత్రమే. ఇక్కడ గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు దక్కించుకోవడంతో ఇక్కడ బలోపేతం అవ్వడానికి పావులు కదుపుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా బలహీనం అవుతుండటం కూడా తమకు కలిసి వస్తుందని భావించారు.

అనేక మంది చేరడంతో…..

నిజానికి తెలంగాణ ఎన్నికలకు ముందు చేరికలు బాగానే ఉన్నాయి. డీకే అరుణ, పొంగులేటి సుధాకర్రెడ్డి, జితేందర్ రెడ్డి, బాబూ మోహన్ వంటి వారు పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఇంకా అనేకమంది పార్టీలో చేరతారని భావించారు. బీజేపీ నేతలు కూడా పదే పదే అదే ప్రకటనలు చేశారు. అయితే ఆ తర్వాత చేరికలు లేవు. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో చేరతారనుకున్నారు. టీడీపీ నుంచి గరికపాటి నరసింహారావు వంటి వారు చేరారు.

ఆ తర్వాత ఎవరూ చేరకపోవడంతో…..

కానీ ఆ తర్వాత ఎవరూ పార్టీలో చేరలేదు. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ప్రయారిటీ బీజేపీ లో ఉండదన్న కారణంగానే ఎవరూ పార్టీలోకి చేరేందుకు ముందుకు రాలేదు. అంతకు ముందు సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలో చేరినా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోవడానికి ప్రాధాన్యత లభించదన్న కారణమూ బలంగా ఉంది.

కొత్తగా చేరిన వారికి పదవులు……

అందువల్లనే కొత్తగా పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర నాయకత్వం. వలసలను ప్రోత్సహించాలంటే కొత్త వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకోసమే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. పురంద్రీశ్వరికి జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. ఇలా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని సంకేతాలను పంపడానికే వీరిద్దరికి పదవులను ఇచ్చింది. దీంతో భవిష‌్యత్ లో చేరికల సంఖ్య పెరుగుతుందని బీజేపీ భావిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News