Kcr and bjp : కేసీఆర్ స్ట్రాటజీతో కమలం పార్టీ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాటజీకి జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడుతుంది.  రాష్ట్రంలో బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నా కేసీఆర్ వ్యూహాలకు [more]

Update: 2021-09-24 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాటజీకి జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పడుతుంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నా కేసీఆర్ వ్యూహాలకు డంగై పోవాల్సి వస్తుంది. కేసీఆర్ కు ముందు నుంచి బీజేపీ తన పార్టీకి ప్రత్యామ్నాయంగా మారబోతుందని తెలుసు. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న నాటి నుంచి కేసీఆర్ కూడా బీజేపీనే తన ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు.

బీజేపీ ని ఇరుకున…

అయితే ప్రజల దృష్టిలో బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు ఆయన అన్ని స్ట్రాటజీలను వాడుతున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ రాష్ట్ర నేతలు మరింత ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ కావాలనే బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావనను ప్రజల్లోకి పంపుతున్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వాన్ని పొగుడుతుండటం పార్టీని ఇరకాటంలోకి నెడుతుంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అపాయింట్ మెంట్ లు ఇచ్చి ఆయనను అక్కున చేర్చుకోవడం బీజేపీ రాష్ట్ర నేతలకు నచ్చడం లేదు.

కేంద్ర మంత్రుల వ్యవహార శైలి…

ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సయితం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఆయన కూడా ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నేతలు ఇటీవల వచ్చిన అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు పార్టీ ప్రయోజనాలు కూడా కాపాడే విధంగా కేంద్ర మంత్రులు వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి అమిత్ షా కూడా అంగీకరించినట్లు సమాచారం.

షా దృష్టికి….

అందుకే అమిత్ షా నిర్మల్ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిజానికి టీఆర్ఎస్ పై క్షేత్రస్థాయిలో బీజేపీ పోరాడుతుంది. వివిధ అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బండి సంజయ్ పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే తాము పడుతున్న శ్రమంతా వృధా అవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. దీనిపై కేంద్ర నాయకత్వంతో మరోసారి చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ ను దూరం పెట్టాలన్నది వీరి ప్రధాన డిమాండ్.

Tags:    

Similar News