బీజేపీకి ఊహించని సెగ… ఎప్పుడూ ఇలా లేదే?

తెలంగాణ బీజేపీలో ఇప్పడు కొత్త పంచాయతీ తలెత్తింది. మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన వారు పదవుల కోసం పట్టుపడుతున్నారు. బీజేపీలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. [more]

Update: 2020-07-26 17:30 GMT

తెలంగాణ బీజేపీలో ఇప్పడు కొత్త పంచాయతీ తలెత్తింది. మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన వారు పదవుల కోసం పట్టుపడుతున్నారు. బీజేపీలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. దీంతో కొత్తగా అధ్యక్షుడిగా నియమితుడైన బండి సంజయ్ ఈ కొత్త వ్యవహారంతో తలపట్టుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కోసం బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంది. ఇందుకోసం రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ప్రధాన కార్యదర్శి పదవి కోసం….

కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కోసం మాల, మాదిగ సామాజిక వర్గాల నుంచి పోటీ పెరిగింది. తెలంగాణలో రెండు సామాజికవర్గాలకు పడదు. రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువ. ఎస్సీ వర్గీకరణను సమర్థించే వర్గమొకటైతే, మరొకటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

పన్నెండేళ్లుగా వారే…..

అయితే బీజేపీ ప్రధాన కార్యదర్శిగా గత పన్నెండేళ్లుగా మాదిగ సామాజిక వర్గానికే దక్కుతూ వస్తుంది. ఓట్ల పరంగా చూసుకుని పార్టీ వారికే ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని మాల సామాజికవర్గం నేతలు కోరుతున్నారు. మాల సామాజికవర్గానికి చెందిన గడ్డం వివేక్ ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావించింది. అయితే ఆయన తనకు వద్దని చెబుతున్నారు. దీంతో చింతాసాంబమూర్తి, ఎస్ కుమార్ లు తమకు పదవి కావాలని కోరుతున్నారు.

తమకు అవకాశం ఇవ్వాలని….

మరోవైపు గరికపాటి మోహన్ రావు వర్గానికి చెందిన రజనికుమారి తనకు ఈ పదవి కావాలని పట్టుబడుతున్నారు. గ్రూప్ వన్ ఆఫీసర్ గా పనిచేశారు. గతంలో టీడీపీలో యాక్టివ్ గా ఉండేవారు. వీరితో పాటు మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి కూడా తనకు ప్రధాన కార్యదర్శి పదవి కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు రెండు సామాజిక వర్గాల్లో ఎవరికి ఇవ్వాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags:    

Similar News