బీజేపీ లెక్కలతో సాగర్ లో గండి ఎవరికి?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ స్ట్రాటజీ కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే తాను గెలవకపోయినా ఎవరో ఒకరిని మాత్రం పరాజితులుగా చేయక తప్పదు. అది [more]

Update: 2021-04-14 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ స్ట్రాటజీ కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే తాను గెలవకపోయినా ఎవరో ఒకరిని మాత్రం పరాజితులుగా చేయక తప్పదు. అది కాంగ్రెస్ కావచ్చు. అధికార టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహం ఏ పార్టీని ఎక్కువగా దెబ్బతీస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇందుకు అభ్యర్థి ఎంపిక ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది.

అనూహ్య ఎంపిక….

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా రవికుమార్ నాయక్ ను తెరమీదకు తీసుకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం సామాజికవర్గమే. లంబాడా సామాజికవర్గానికి చెందిన రవికుమార్ వైద్యుడు కూడా. ఆ ప్రాంతంలో లంబాడాలకు మాత్రమే కాకుండా అందరికీ సుపరిచితులు. ఇక తన ఫౌండేషన్ ద్వారా కూడా రవికుమార్ సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవికుమార్ ఎన్ని ఓట్లు చీలిస్తే ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతుంది.

ప్రత్యేక వ్యూహంతోనే…..

గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన నివేదిత రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు రవికుమార్ ను తెరమీదకు తీసుకురావడంలో బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకుందంటున్నారు. నాగార్జున సాగర్ లో యాదవ సామాజికవర్గం తర్వాత ఎక్కువగా ఉంది లంబాడా సామాజికవర్గమే. యాదవుల ఓట్లు 36,642 ఉంటే, లంబాడా సామాజికవర్గం ఓట్లు 34,027 ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో రెండోస్థానంలో ఉన్న సామాజికవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసింది.

ఇరు పార్టీలకూ….

ఇక నాగార్జున సాగర్ లో రెడ్డి సామాజికవర్గం ఓట్లు 24 వేలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ లంబాడా సామాజికవర్గం లో అధిక భాగం అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోంది. ఈసారి ఆ ఓట్లు జానారెడ్డికి పడే అవకాశముందని గుర్తించిన బీజేపీ రవికుమార్ నాయక్ ను రంగంలోకి దించింది. దీంతో ఆయన వల్ల రెండు పార్టీలకూ నష్టమేనంటున్నారు. గంపగుత్తగా సామాజికవర్గం ఓట్లను దక్కించుకుంటే పరువు నిలబడటమే కాదు..టీఆర్ఎస్ కు కూడా చెక్ పెట్టే అవకాశముందన్నది బీజేపీ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News