ఈ ఎగ్జాంపుల్ చాలదా? బలం పెరిగిందనడానికి

తెలంగాణలో బీజేపీ బలపడుతున్నదనడానికి కాంగ్రెస్ బలహీనమవ్వడమే కారణం. ఇది అందరికీ తెలిసిందే. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ టిక్కెట్ కోసం పోటీ పడుతుండటం అందరినీ [more]

Update: 2021-04-09 11:00 GMT

తెలంగాణలో బీజేపీ బలపడుతున్నదనడానికి కాంగ్రెస్ బలహీనమవ్వడమే కారణం. ఇది అందరికీ తెలిసిందే. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ టిక్కెట్ కోసం పోటీ పడుతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. టిక్కెట్ల కోసం నేతలు కమలం పార్టీ గేటు వద్ద నిరీక్షణలు చేశారంటే ఆ పార్టీ క్రమంగా బలపడుతుందనే చెప్పాలి. ఇది ఒకరకంగా బీజేపీకి శుభపరిణామమే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడినా గెలిచినా బీజేపీకి రానున్న రోజుల్లో అభ్యర్థుల కొరత ఉండదన్నది వాస్తవం.

మొన్నటి ఎన్నికల్లో…..

2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. అదీ హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. కిషన్ రెడ్డి లాంటి నేతలు సయితం ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించడానికి బీజేపే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో సగం సీట్లను నింపేసింది.

పార్లమెంటు ఎన్నికల తర్వాత….

అయితే క్రమంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి మారుతుంది. నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడంతో ఒక్కసారిగా బీజేపీకి హైప్ పెరిగింది. దీనికి తోడు కాంగ్రెస్ వరస పరాజయాలు బీజేపీకి కలసి వచ్చాయని చెప్పాలి. పేరున్న నేతలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. ఇక దుబ్బాక ఎన్నికలలో గెలుపు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో ఇక బీజేపీ టిక్కెట్లకు డిమాండ్ పెరిగిందనే చెప్పాలి.

పోటీ మంచికేగా?

సహజంగా ఉప ఎన్నిక అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికనే తీసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీ చేస్తుండటంతో గెలుపు ఆ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. అయినా బీజేపీలో టిక్కెట్ల కోసం పోటీ ఉందంటే ఆ పార్టీ క్రమంగా బలం పెరుగుతుందనే చెప్పాలి. ఈ టిక్కె్ట కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత తో పాటు ఐదారుగురు పోటీ పడ్డారు. అంజయ్య, ఇంద్రసేనారెడ్డి వంటి వారు కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. గెలుపు అవకాశాలు లేవని తెలిసినా ఉప ఎన్నికలో టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉండటం ఆ పార్టీకి ముందు ముందు భవిష్యత్ ఉందన్నది చెప్పకనే చెప్పవచ్చు.

Tags:    

Similar News