ఇక ఇక్కడ బీజేపీ ఆశలు ఫలించవా?

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నా రాజకీయాలకు ఏ మాత్రం కొదవలేదు. అధికార పార్టీ సంగతి అలా పెడితే ప్రతిపక్ష బీజేపీ సయితం అసంతృప్తులతో రగిలిపోతుంది. భారతీయ జనతా పార్టీ [more]

Update: 2020-05-14 16:30 GMT

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నా రాజకీయాలకు ఏ మాత్రం కొదవలేదు. అధికార పార్టీ సంగతి అలా పెడితే ప్రతిపక్ష బీజేపీ సయితం అసంతృప్తులతో రగిలిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన వైఖరి వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నె 21వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉండటంతో ఎన్నికల కమిషన్ కరోనా వ్యాప్తి ఉన్నా ఎన్నికలు జరపడానికే నిర్ణయించింది.

శాసనమండలి ఎన్నికల్లో….

మహారాష్ట్రలో మొత్తం 9 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288 ఉన్నాయి. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలసి పోటీ చేశాయి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలను గెలుచుకున్నాయి. అధికారంలోకి ఈ కూటమి రావాల్సి ఉన్నా ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన పట్టుబట్టడం, బీజేపీ అంగీకరించకపోవడంతో కొత్త కూటమి ఏర్పడి అధికారంలోకి వచ్చింది.

నాలుగు సీట్లను….

అనేక డ్రామాల నడుమ శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్ ల సహకారంతో బండిని లాగించేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని బీజేపీ కైవసం చేసుకునే అవకాశముంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో నాలుగు బీజేపీ, ఐదు శివసేన కూటమికి దక్కనున్నాయి. అయితే బీజేపీ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో అసంతృప్తికి కారణమయింది.

అసంతృప్తి వ్యక్తం చేసిన….

ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి గోపినాధ్ ముండే కుమార్తె పంకజ ముండే కు ఎమ్మెల్సీ అవకాశాన్ని బీజేపీ నాయకత్వం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పంకజ ముండే ఓడిపోయారు. అప్పుడే బీజేపీ అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రకటించిన జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో పార్టీని వీడేందుకు పంకజ ముండే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందే మహారాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పంకజముండే త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంకజ ముండే పార్టీని వీడితే బీజేపీ బలమైన ఓటుబ్యాంకును కోల్పోయినట్లే. మరి దేవేంద్ర ఫడ్నవిస్ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

Tags:    

Similar News