ఆపరేషన్ ఆగిపోయినట్లే… కట్టుగా ఉన్నందుకే?

రాజస్థాన్ తర్వాత మహారాష్ట్రలో ఆపరేషన్ ను స్టార్ట్ చేయాలనుకుంది బీజేపీ. అయితే రాజస్థాన్ లో సక్సెస్ కాకపోవడంతో మహారాష్ట్రలో మరికొంత కాలం గ్యాప్ ఇచ్చే అవకాశముంది. దీనికి [more]

Update: 2020-08-31 17:30 GMT

రాజస్థాన్ తర్వాత మహారాష్ట్రలో ఆపరేషన్ ను స్టార్ట్ చేయాలనుకుంది బీజేపీ. అయితే రాజస్థాన్ లో సక్సెస్ కాకపోవడంతో మహారాష్ట్రలో మరికొంత కాలం గ్యాప్ ఇచ్చే అవకాశముంది. దీనికి తోడు బీహార్ రాజకీయాలు ఇప్పుడు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని మరింత గట్టిపరుస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేసేందుకు మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి బీజేపీకి ఎదురవుతోంది.

తిరిగి చేజిక్కించుకోవాలని….

మహారాష్ట్రలో ఎలాగైనా తిరిగి అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. తాము అత్యధిక స్థానాలను సాధించుకున్నప్పటికీ అధికారంలోకి రాలేకపోయామన్న ఆవేదన ఆ పార్టీలో కన్పిస్తుంది. అందుకే రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండగానే ఇటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు వల వేసింది. అది సాధ్యం కాకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎర వేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం కావడంతో ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రాలేదు. రాజీనామాలు చేసి వచ్చే అవకాశం మహారాష్ఱలో లేదు.

అన్ని విధాలుగా ప్రయత్నించి…..

ఇక చివరకు శివసేనకు కూడా గాలం వేసింది. శివసేనతో తాము కలసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది. శివసేన అంగీకరిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమని కూడా బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ శివసేన ప్రస్తుతం కుదురుగా ఉంది. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఉద్ధవ్ థాక్రేకే ఉంటుంది. బీజేపీతో కలసి వెళితే చివరి రెండేళ్లయినా ముఖ్యమంత్రి పదవిని దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ ప్రతిపాదనను శివసేన వినీ విన్నట్లు ఊరుకుంది.

సుశాంత్ కేసుతో…..

కానీ తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు సంకీర్ణ ప్రభుత్వాన్ని మరింత సుస్థిర పరిచిందంటున్నారు. సుశాంత్ ఆత్మ హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ బీహార్ ప్రభుత్వం సిఫార్సు చేయడం, కేంద్ర ప్రభుత్వం అంగీకరిచండంతో శివసేనతో పాటు మిగిలిన పక్షాలు శివాలెత్తిపోతున్నాయి. సుశాంత్ కేసును బీహార్ లో రాజకీయంగా మార్చు కునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ బురదచల్లుతుందని శివసేన ఆరోపిస్తుంది. ముంబయి పోలీసుల పనితీరును కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారంది. సామ్మా పత్రికలో కూడా దీనిపై విమర్శలు చేసింది. ఎన్సీపీ, కాంగ్రెస్ లు కూడా బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. దీంతో బీజేపీ మహారాష్ట్ర ఆపరేషన్ కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News