ఛీ…ఛీ చెప్పుకోవడానికైనా సిగ్గుండాలిగా…?

బీజేపీ నేతలు ఓటమిని అంగీకరించరు. తమపై వ్యతిరేకత ఉందని ఫలితాలు స్పష్టం చేసినా కుంటిసాకులు వెతుక్కునే పనిలో ఉన్నారు కమలనాధులు. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతల [more]

Update: 2021-01-09 18:29 GMT

బీజేపీ నేతలు ఓటమిని అంగీకరించరు. తమపై వ్యతిరేకత ఉందని ఫలితాలు స్పష్టం చేసినా కుంటిసాకులు వెతుక్కునే పనిలో ఉన్నారు కమలనాధులు. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతల విశ్లేషణను చూస్తే ఇంత తెగించి మాట్లాడే వారు కూడా ఉంటారా? అన్నది అర్థం కాక తప్పదు. గత కొన్నిరోజులుగా పంజాబ్, హర్యానాకు సంబంధించిన రైతులు తమ సమస్యల కోసం ఆందోళన చేస్తున్నారు. వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది.

గట్టి ఎదురుదెబ్బే…

అయితే ఈ నేపథ్యంలో హర్యానాలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడుచోట్ల పరాజయం పాలయింది. బీజేపీ ఎఫెక్ట్ మిత్రపక్షమైన జన నాయక్ జనతా పార్టీ మీద కూడా పడటం విశేషం. బీజేపీకి హర్యానా ప్రాంతంలో బాగా బలమున్న అంబాలా, సోనిపట్ మున్సిపాలిటీలను కూడా బీజేపీ చేజార్చుకుంది. అయితే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లనే ఈ ఓటమి బీజేపీకి ఎదురయిందని అందరూ అంగీకరిస్తున్న విషయం.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ…..

ఇదే కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ పొడిచేంత సీట్లను సాధించలేదు. జననాయక్ జనతా పార్టీ కనుక మద్దతివ్వకుంటే బీజేపీకి హర్యానా అధికారం దక్కేది కాదు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్ 31 స్థానాలను చేజిక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్ 46కు చేరుకోలేకపోయిన బీజేపీని దుష్యంత్ చౌతాలా ఆదుకున్నారు. ఆయన మద్దతివ్వడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దుష్యంత్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.

వినడానికి బాగానే ఉన్నా…..?

అయితే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గల కారణాలపై బీజేపీ నేతల విశ్లేషణను చూసి నోరు తెరవక తప్పదు. బీజేపీ ఓటర్లందరూ హాలిడే లో ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ శర్మ చెప్పడం విశేషం. వరసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో బీజేపీ ఓటు బ్యాంకు మొత్తం సెలవులకు వెళ్లిపోయిందని ఆయన చెప్పడం వినడానికి బాగానే ఉన్నా అధినాయకత్వం కూడా నమ్మని పరిస్థితి. ఓటమికి బాధ్యత వహించాలి తప్పించి పలాయన వాదం మంచిది కాదని ఇప్పటికే హైకమాండ్ అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది. హర్యానాలో ఓటమికి ప్రధాన కారణం రైతుల ఆందోళనేనని చెప్పక తప్పదు.

Tags:    

Similar News