మోదీని నమ్ముకుంటే మునిగినట్లే?

ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ ఏం చేయలేదన్నది. కాంగ్రెస్ బలహీనతనే బీజేపీ సొమ్ము చేసుకుంటూ వస్తోంది. తాజాగా [more]

Update: 2021-05-03 18:29 GMT

ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ ఏం చేయలేదన్నది. కాంగ్రెస్ బలహీనతనే బీజేపీ సొమ్ము చేసుకుంటూ వస్తోంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇదే స్పష్టం చేశాయి. పుదుచ్చేరి, అసోంలో కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ ను దెబ్బతీసి అధికారంలోకి రాగలిగింది. అదే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ప్రాంతీయ పార్టీల చేతుల్లో చావుదెబ్బతినింది.

సరైన నాయకత్వం లేక….

రాష్ట్రాల్లో సరైన నాయకత్వం లేదన్నది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది. యడ్యూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి నాయకత్వం ఉన్న చోట పార్టీ జెండా ఎగరగలిగింది. అదే మిగిలిన రాష్ట్రాల్లో మోదీ ఇమేజ్ పైనే బీజేపీ ఆధారపడి ఉంది. ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తూ వచ్చిన బీజేపీ మోదీ ఇమేజ్ ను కారణంగా చూపుతూ వచ్చింది. స్వచ్ఛమైన పాలనతోనే జనం తమకు పట్టం కడుతున్నారని చెబుతూ వస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మాత్రం ఇది ఉత్తదేనని తేలిపోయింది.

ప్రభుత్వంపై వ్యతిరేకత…..

పెట్రోలు, గ్యాస్ ధరలు పెంచడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బీజేపీపై కోపం పెంచుకున్నారు. పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటున్న ప్రభుత్వం పేద ప్రజలను దూరంగా పెడుతుందన్న విమర్శలు బాగానే విన్పించాయి. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోలేక పోయింది. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు మాత్రం బీజేపీపై ఉన్న వ్యతిరరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.

ప్రాంతీయ పార్టీలే….

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ మూడోసారి అధికారంలోకి వచ్చారంటే అది మమతపై ఉన్న వ్యతిరేకత కంటే బీజేపీ పై ఉన్న అసంతృప్తి కారణమని తెలుస్తోంది. మరోవైపు కేరళలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేదు. దీంతో అక్కడ మళ్లీ పినరయి విజయన్ కు ప్రజలు పట్టం కట్టారు. దీనిద్వారా అర్థమయిందేంటంటే మోదీని నమ్ముకుంటే మునగడం ఖాయం. రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పెంచుకుంటేనే భవిష్యత్ లో విజయం దక్కుతుందన్న విమర్శలు ఆ పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News