మోదీకి ముకుతాడు వేస్తారా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సవాల్ గా మారాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీకి ఛాన్స్ కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం [more]

Update: 2021-03-26 17:30 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సవాల్ గా మారాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీకి ఛాన్స్ కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒపీనియన్ పోల్స్ లో స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్ లో కొద్దో గొప్పో ఆశలు పెట్టుకున్నా అది కూడా నెరవేరే అవకాశం కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన వర్గాలు దూరమవుతున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

దిగువ, మధ్య తరగతి ప్రజలు…..

భారతీయ జనతా పార్టీకి మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలే అండగా ఉంటూ వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీకి పట్టు ఎక్కువగా ఉంది. అయితే కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ విజయానికి అడ్డంకిగా మారనున్నాయి. ముఖ్యంగా పెట్రోలు ఉత్పత్తుల ధరలు పెరగడంపై సోషల్ మీడియాలో మోదీపై దారుణమైన కామెంట్స్ వినపడుతున్నాయి.

ప్రజలకు చేసిందేంటి?

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకూ అన్నీ ప్రజలను పీడించేవే అయినప్పుడు మోదీ పార్టీకి ఎందుకు మద్దతివ్వాలన్న కామెంట్స్ బలంగా కనపడుతున్నాయి. పెట్రోలు ధరలు పెరగడంతో పేద, మధ్యత తరగతి ప్రజలు బీజేపీకి దాదాపుగా దూరమయ్యారు. ఈ ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగా కనపడుతుందని చెబుతున్నారు.

ఓటేస్తే అమ్మేస్తారంటూ….

ఇక మోదీకి వరస విజయాలందిస్తూ పోతే ప్రతిదీ అమ్మకానికి పెడతారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం మొదలు పెట్టారు. రైల్వేలను కూడా ప్రయివేటు పరం చేయాలన్న యోచనలో ఉన్నారు. ఇప్పడు సోషల్ మీడియాలో ఇవే చర్చగా మారాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి విజయం అంత సులువుగా లభించదనే చెప్పాలి. మోదీకి ముకుతాడు వేయడానికే ప్రజలు నిర్ణయించుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News