సక్సెస్ అయినట్లే.. అనుకున్నట్లుగానే?

భారతీయ జనతా పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ప్రధానంగా ఓట్లను తమవైపునకు కీలక సమయాల్లో తిప్పుకోవడంలో బీజేపీకి మించిన పార్టీ లేదనే చెప్పాలి. గెలిచినా, ఓడినా [more]

Update: 2020-11-10 12:30 GMT

భారతీయ జనతా పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ప్రధానంగా ఓట్లను తమవైపునకు కీలక సమయాల్లో తిప్పుకోవడంలో బీజేపీకి మించిన పార్టీ లేదనే చెప్పాలి. గెలిచినా, ఓడినా తెలంగాణలో బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నికల్లో సుస్థిర స్థానం దక్కినట్లే చెప్పాలి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగానే పేర్కొనాలి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అడుగడుగునా అడ్డుకుని…..

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం నుంచి బీజేపీ దూకూడుగా వెళ్లింది. అధికార టీఆర్ఎస్ పార్టీని అడగడుగునా అడ్డుకుంది. మూడు సార్లు అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయిన రఘునందన్ ను అభ్యర్థిగా ప్రకటించి సానుభూతి ఓట్లను సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. రఘునందన్ బంధువుల ఇళ్లపై పోలీసుల దాడులు, బండి సంజయ్ అరెస్ట్ వంటివి బీజీపీకి బాగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి.

కేంద్ర నాయకత్వం…..

బీజేపీ కేంద్ర నాయకత్వం పెట్టుకున్న ఆశలను రాష్ట్ర నేతలు నెరవేర్చారనే చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ ను మూడో స్థానానికి బీజేపీ నెట్టేసింది. తాను టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయమని దుబ్బాక ఉప ఎన్నికల్లో నిరూపించింది. ఇది ఖచ్చితంగా రానున్న కాలంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా బీజేపీకి లాభించే అంశమేనని చెప్పక తప్పదు. దీంతో పాటు ఇప్పటి వరకూ బీజేపీలో చేరేందుకు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపడం లేదు.

చేరికలు కూడా….

కానీ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత బీజేపీలో చేరిక లు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు నేతలు రాకపోయినా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతాయి. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నికల బీజీపీకి కలసి వచ్చిందనే చెప్పాలి. నాయకత్వాన్ని పెంచుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును పెంచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ నేతలు మోదీ, షాల నమ్మకాన్ని రాష్ట్ర నేతలు దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా నిలబెట్టారనే చెప్పాలి.

Tags:    

Similar News