బీజేపీ మొదలెట్టింది.. ఆ పార్టీలు షేక్ అవుతున్నాయ్

బీహార్ ఎన్నికలు ముగిశాయి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే స్వల్ప తేడాతోనే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో అధికారంలోకి రావాలంటే [more]

Update: 2020-11-22 18:29 GMT

బీహార్ ఎన్నికలు ముగిశాయి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే స్వల్ప తేడాతోనే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 122. ఈ ఎన్నికల్లో 125 స్థానాలను ఎన్డీఏ సాధించగా, 115 స్థానాలను ఆర్జేడీ కూటమి సాధించింది. కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు అతి తక్కువ స్థానాలతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.

మంత్రివర్గం ఏర్పాటు తర్వాత…..

మంత్రి వర్గం ఏర్పాటు తర్వాత ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూలలో అసంతృప్తులు తలెత్తే అవకాశముంది. ప్రధానంగా జేడీయూలో 47 మంది శాసనసభ్యులు గెలిచారు. ఈసారి మంత్రివర్గంలో జేడీయూకు తక్కువ స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీజేపీ అత్యధిక స్థానాలను గెలవడం, జేడీయూకు చెందిన నితీష్ కుమార్ కే ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వడంతో పాలకపక్షమైన జేడీయూలో అసంతృప్తి చోటు చేేసుకునే అవకాశముంది.

నితీష్ ఇమేజ్ తగ్గడంతో….

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇమేజ్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయంగా తగ్గిపోయింది. వచ్చే ఎన్నికలకు ఆర్జేడీ మరింత పుంజుకునే అవకాశముంది. అందుకే జేడీయూ నుంచి అసంతృప్తులు తలెత్తి ఆర్జేడీలో చేరితే మళ్లీ బీహార్ లో రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. రానున్న కాలంలో రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వలవేస్తున్నారని సమాచారం.

కాంగ్రెస్, ఆర్జేడీలు టార్గెట్….

ఇప్పటికే పది మంది వరకూ కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీ టచ్ లోకి వచ్చారని సమాచారం. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ ఆఫర్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. తేజస్వి యాదవ్ ను మరింత బలహీనపర్చడమే కాకుండా, శాసనసభలో విపక్ష వాయిస్ ను తగ్గించాలనే బీజేపీ బీహార్ లో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సిన అవసరం ఏర్పడినా శాసనసభ్యుల మద్దతు అవసరమని ముందుగానే ఈ చర్యలకు బీజేపీ దిగినట్లు చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు చిన్నా చితకా పార్టీలు బీజేపీ వ్యూహంతో షేక్ అవుతున్నాయి.

Tags:    

Similar News