మోదీ గారూ…. ఇది కరెక్ట్ కాదేమో?

కరోనా ఏమంటూ వచ్చిందో కాని సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాజకీయ నేతలు మాత్రం కరోనాను కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాకు [more]

Update: 2020-10-23 18:29 GMT

కరోనా ఏమంటూ వచ్చిందో కాని సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాజకీయ నేతలు మాత్రం కరోనాను కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది కూడా వ్యాక్సిన్ వచ్చేది అనుమానమేనని అంటున్నారు. కానీ అధికారం కోసం అలివి కాని హామీలను ఇవ్వడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఉచితంగా వ్యాక్సిన్….

బీహార్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ కరోనా వ్యాక్సిన్ ను బీహార్ ప్రజలందరికీ ఉచితంగా అందచేస్తామని హామీ ఇచ్చింది. ఇది వివాదమయింది. కరోనా వ్యాక్సిన్ వచ్చేదెప్పుడు? దానిని బీహార్ ప్రజలకు ఇచ్చేదెప్పుడు? ఎన్నికలు ఎప్పుడు? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూటిగానే ప్రశ్నించారు. అంటే ఒక్క బీహార్ లోనే ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేస్తారా? దేశమంతా చేస్తారా? చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

తమిళనాడులోనూ…..

ఉచిత వ్యాక్సిన్ పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే తాము ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినా ఉచితంగా ఇస్తామనే చెప్పామే తప్ప ఇది ఎన్నికల హామీ కాదంటూ బీజేపీ కొట్టి పారేస్తుంది. బీహార్ లో బీజేపీ ఇలా ఉంటే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఇదే పాట పాడుతుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి కరోనా వ్యాక్సిన్ తమ పార్టీ ఉచితంగా అందజేస్తుందని ఇచ్చిన హామీ హాట్ టాపిక్ గా మారింది.

అమెరికా అధ్కక్ష ఎన్నికల్లోనూ……

ఇది కేవలం భారత్ కే పరిమితం కాలేదు. అమెరికా అధ్యక్ష్య ఎన్నికలయితే ఏకంగా కరోనా వ్యాక్సిన్ ప్రధాన అంశంగా జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అయితే మరికొద్ది రోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి జోబైడెన్ ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదంటున్నారు. కరోనా విజృంభించడానికి ట్రంప్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ ఆయుధంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News