Badvel : బద్వేలులో బీజేపీకి బాబు భారీ షాకిచ్చారుగా?

బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ భారీ మెజారిటీ దిశగా విజయం సాధించనున్నారు. ప్రతి రౌండ్ లోనూ వైసీపీ ఏకపక్షంగా [more]

Update: 2021-11-02 06:30 GMT

బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ భారీ మెజారిటీ దిశగా విజయం సాధించనున్నారు. ప్రతి రౌండ్ లోనూ వైసీపీ ఏకపక్షంగా ఓట్లను సాధించుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… టీడీపీ, జనసేన పైన ఆశలు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. టీడీపీ, జనసేనల ఓటు బ్యాంకు బీజేపీ వైపు మరల లేదన్నది విశ్లేషకుల అంచనా. బద్వేలులో బీజేపీ బలంగా లేకపోయినా టీడీపీ, జనసేనల మద్దతు లభిస్తుందని ఆశించింది.

కనీస స్థాయిలో….

కానీ వస్తున్న ఎన్నికల ఫలితాలను చూస్తుంటే… బీజేపీకి ఇరవై వేల ఓట్లకు మించి రావని అనిపిస్తుంది. గతంలో జరిగిన బద్వేలు ఉప ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ప్రతి ఎన్నికల్లో టీడీపీకి అరవై వేల ఓట్లకు పైగా సాధించేది. బద్వేలు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటికి దూరంగా ఉంది. జనసేన కూడా పోటీకి దూరంగా ఉన్న గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీఎస్సీకి పొత్తులో భాగంగా కేటాయించింది.

టీడీపీ ఓటర్లు…

ఇప్పుడు రెండు పార్టీలకు చెందిన అనుకూల ఓటర్లు దాదాపు 60 వేల వరకూ ఉండాలి. కానీ ఇక్కడ బీజేపీకి పడిన ఓట్లు చూస్తే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా బీజేపీకి ఓటు వేయడానికి ఇష్పపడనట్లు కన్పించింది. రెండు పార్టీలు లోపాయికారిగా సహకరించాయన్న వార్తల నేపథ్యంలో బీజేపీకి కనిసం నలభై వేల ఓట్లయినా రావాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. టీడీపీ నేతలు పరోక్షంగా చెప్పినా ఆ పార్టీ సానుభూతి పరులు మాత్రం బీజేపీ వైపు చూడలేదు.

నోటాకే ఎక్కువ ఓట్లు…

ఇక జనసేన బలం ఉన్నప్పటికీ బీజేపీకి ఇక్కడ ఉపయోగపడినట్లు కన్పించలేదు. కేంద్రమంత్రులతో సహా అందరూ బద్వేలు ఉప ఎన్నికపై దృష్టి పెట్టి నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. టీడీపీ సానుభూతిపరులు కొందరు బీజేపీకి వేయడం ఇష్టంలేక నోటాకు వేసినట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఎనిమిది రౌండ్లు ముగిసే సమయానికి నోటాకు రెండు వేలకు పైగా ఓట్లు పడటమే ఇందుకు నిదర్శనం. మొత్తం మీద కమలం పార్టీకి టీడీపీ ఓట్లు పూర్తిస్థాయిలో టర్న్ కాలేదన్నది వాస్తవం.

Tags:    

Similar News