స్టిక్కర్ లు పక్క రాష్ట్రంలో చూస్తున్నామా సోమూ?

జాతీయ పార్టీ బీజేపీకి అన్ని రాష్ట్రాల్లోనూ నేత‌లు ఉన్నారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో లేవ‌నెత్తని పాయింట్లు, ఆయా రాష్ట్రాల్లో నేత‌లు చేయ‌ని విమ‌ర్శలు మాత్రం ఏపీలో నేత‌లు [more]

Update: 2020-10-18 00:30 GMT

జాతీయ పార్టీ బీజేపీకి అన్ని రాష్ట్రాల్లోనూ నేత‌లు ఉన్నారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో లేవ‌నెత్తని పాయింట్లు, ఆయా రాష్ట్రాల్లో నేత‌లు చేయ‌ని విమ‌ర్శలు మాత్రం ఏపీలో నేత‌లు చేస్తున్నారు ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో చ‌ర్చకు వ‌చ్చింది. కేంద్ర నిధుల‌తో రాష్ట్రంలో కార్యక్రమాలు చేప‌డుతూ.. జ‌గ‌న్ పేరు వేసుకుంటున్నార‌ని ఏపీ బీజేపీ నేత‌లు ఆడిపోసుకుంటున్నారు. అంతేకాదు, కేంద్రం పేరుతో పెట్టుకున్న ప‌థ‌కాల‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ పేరు కూడా పెట్టాల‌ని అంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లో…..

ఇది వాస్తవ‌మే అయితే.. ఇత‌ర రాష్ట్రాల్లో ఎందుకు నిల‌దీయ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఎందుకు బీజేపీ నాయ‌కులు సైలెంట్‌గా ఉంటున్నారు ? అక్కడ కేంద్రం నిధులు ఇవ్వడం లేదా ? లేక అక్కడ నేత‌ల‌కు భ‌య‌మా ? అనేది అర్ధం కాని వ్యవ‌హారం. గ‌తంలో ఇలానే రైతు భ‌రోసా విష‌యంలో యాగీ చేసిన‌ప్పుడు జ‌గ‌న్ ఆ ప‌థ‌కానికి ప్రధాన మంత్రి వైఎస్సార్ రైతు భ‌రోసా కింద పేరు మార్చి అమ‌లు చేశారు.

నిధులు కేంద్రమే ఇచ్చిందంటూ…..

అయితే, తాజాగా ఆయ‌న మ‌రో కీల‌క ప‌థ‌కాన్ని కూడా ప్రవేశ పెట్టారు. అదే జ‌గ‌గ‌న్న విద్యాకానుక‌. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లోనూ చ‌దివే విద్యార్థుల‌కు రు. 650 కోట్లతో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. అయితే, ఇది బీజేపీ నేత‌లు కార్నర్ చేసేందుకు అవ‌కాశం ఇచ్చింది. ఈ సొమ్ములో ఎంత కేంద్రం ఇచ్చిందో చెప్పలేదు కానీ.. కేంద్రం డ‌బ్బులు ఉన్నాయి కాబ‌ట్టి ప్రధాని మోడీ పేరు ఎందుకు పెట్టడం లేద‌ని నిల‌దీశారు. నిజానికి అదే స‌మ‌యంలో ఈ ప‌థ‌కానికి ఎంత మేర‌కు నిధులు ఇచ్చార‌నే విష‌యాన్ని వెల్లడించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

జీఎస్టీ బకాయిలే…..

వాస్తవానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా.. జ‌నాభా లెక్కల ప్ర‌కారం , రాష్ట్రం క‌డుతున్న ప‌న్నుల మేర‌కు మాత్రమే నిధులు కేటాయిస్తుంది త‌ప్ప.. అయాచితంగా .. జ‌గ‌న్ ఏదో ప‌థ‌కం పెట్టుకున్నాడు కాబ‌ట్టి.. ఇస్తుంద‌నేది వాస్తవం కాదు. అలా అయితే, అనేక ప‌థ‌కాల‌కు నిధులు ఇవ్వాలి. కానీ అలా ఇవ్వక‌పోగా.. కోత‌లు పెడుతున్న విష‌యాన్ని బీజేపీ నాయ‌కులు గుర్తుంచుకోవాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. అదే స‌మ‌యంలో కుదిరితే.. జీఎస్టీ బ‌కాయిలు ఇప్పించి మాట్లాడితే.. వారిపై విశ్వస‌నీయ‌త‌కు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ రెండూ లేకుండా ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా ప్రయోజ‌నం శూన్యమ‌ని అంటున్నారు. మ‌రి రాష్ట్ర క‌మ‌ల నాథులు ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News