బిజెపి గేర్ మారుస్తుందా … ?

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పాలిటిక్స్ లో స్పీడ్ పెంచేందుకు బీజేపీ గేర్ మార్చినట్లే కనిపిస్తుంది. ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తమ వికెట్లను [more]

Update: 2020-06-14 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పాలిటిక్స్ లో స్పీడ్ పెంచేందుకు బీజేపీ గేర్ మార్చినట్లే కనిపిస్తుంది. ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తమ వికెట్లను వైసిపికి సమర్పించుకుని బలహీనపడుతూ వస్తుంది. త్వరలో విపక్ష హోదాను చంద్రబాబు కోల్పోయే పరిస్థితి దగ్గరలోనే ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన విపక్ష పాత్రను తాము అందిపుచ్చుకునే తరుణం తొందరలోనే చేపడతామని సంబరపడుతున్నారు కమలనాధులు. ఈ నేపథ్యంలోనే అధికారపార్టీ వైసిపి తప్పులను పెద్ద ఎత్తున ఫోకస్ చేసేందుకు కమలదళం కత్తులు దూసేందుకు రంగంలోకి దిగుతుంది. అందులో భాగంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి సాయం అందిస్తుందన్నది ముందుగా ప్రస్తావిస్తూ రాష్ట్ర వాసుల్లో కేంద్రం పట్ల ఉన్న వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ.

రంగంలోకి రామ్ మాధవ్ …

బీజేపీ ఇప్పుడు ఎపి పాలిటిక్స్ లో తమదైన పాత్రను నిర్వర్తించేందుకు రామ్ మాధవ్ ను తిరిగి యాక్టివ్ చేసినట్లే కనపడుతుంది. ఎపి వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ ఇప్పటికే అన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే బీజేపీ పాత, కొత్త నేతల నడుమ ఆయన సమన్వయం సాధించలేకపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సాగిపోతున్నారు. కొత్తగా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నవారు తెలుగుదేశం అనుకూల వ్యాఖ్యలు వైసిపి పై కస్సుబుస్సు లాడుతున్నారు. పాత బీజేపీ నేతలు మాత్రం అధికార వైసిపి, విపక్ష టిడిపి లపై విరుచుకుపడుతున్నారు. ఈ ధోరణి మాత్రం మొత్తం పార్టీ వైఖరిగా ఉండటం లేదు.

చేసింది చెప్పుకుంటూ … ఇది స్ట్రేటజీ…..

దాంతో సీన్ లోకి వచ్చిన రామ్ మాధవ్ టార్గెట్ వైసిపి అన్నది తాజాగా చెప్పకనే చెప్పేశారు. టిడిపి గతంలో చేసిన తప్పులను గుర్తు చేస్తూనే వైసిపి పై పెద్ద ఎత్తునే దాడి మొదలు పెట్టి పార్టీ శ్రేణులకు దిశా దశా నిర్దేశించారు. మోడీ సర్కార్ 35 వేలకోట్ల రూపాయలు ఏపీకి పన్నుల వాటా రూపంలో ఇవ్వాలని ఇప్పటికే పదివేలకోట్ల రూపాయలు రెండు నెలల్లో ఇచ్చేసిందని చెప్పడం ద్వారా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్న చేయూత చెప్పుకోవాలన్న సూచనలు బీజేపీ శ్రేణులకు చేశారు రామ్ మాధవ్. అయితే ఆయన చూపిన మార్గం ఎంతమంది అనుసరిస్తారు ? దీనివల్ల కమలం లబ్ది పొందుతుందా అన్నది వేచి చూడాలి

Tags:    

Similar News