ap bjp : ఎదగాలనుకున్నా… కుదరదులే?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావచ్చింది. కానీ రెండున్నరేళ్ల కాలంలో బీజేపీ ఇక్కడ పెద్దగా బలపడింది లేదు. జనసేనతో పొత్తు తప్ప ఆ [more]

Update: 2021-09-22 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావచ్చింది. కానీ రెండున్నరేళ్ల కాలంలో బీజేపీ ఇక్కడ పెద్దగా బలపడింది లేదు. జనసేనతో పొత్తు తప్ప ఆ పార్టీకి ఏపీలో సానుకూల అంశాలేవీ కన్పించడం లేదు. ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు కూడా కన్పించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలన్న బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వవు. దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలే.

కేంద్రం నిర్ణయాలు…

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి నాయకత్వ సమస్యే కాదు. ఇక్కడ ఎదగలేకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలేనని చెప్పక తప్పదు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వరస నిర్ణయాలు, నాన్చుడు ధోరణిని ఆ పార్టీకి మరోసారి శాపంగా మారనుంది. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు దాటుతున్న విభజన హామీలను అమలుపర్చలేకపోయింది. అన్ని రాష్ట్రాలకు విడుదల చేసే నిధులనే ఏపీకి కూడా విడుదల చేస్తుంది.

అన్నింటా వివక్ష….

పోలవరంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష ఇక్కడ బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఇక ప్రత్యేక హోదా సంగతి ఎలాగూ ఉండనే ఉంది. దీనికి తోడు విమానాశ్రయాలను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం, పెట్రోలు ధరలను పెంచడం ఆ పార్టీని మరింత పాతాళంలోకి తోసేసినట్లే. వచ్చే ఎన్నికలకు మోదీ ఇమేజ్ కూడా పనిచేసే అవకాశం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.

ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా….

దీంతో ఏపీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను కొంత తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకోసమే సోము వీర్రాజు తరచూ సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ ఆలయాలపై దాడులు, మతపరమైన అంశాలపై ఉద్యమాలు చేసిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు సమస్యలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. కానీ ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు వృధాయేనన్నది విశ్లేషకుల అంచనా. పార్ట్ నర్ పవన్ కల్యాణ్ పై నమ్మకం లేకపోవడం, బీజేపీని ప్రజలు పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఏపీలో ఆ పార్టీ ఎదుగుదల అసాధ్యమేనన్నది వాస్తవం.

Tags:    

Similar News