బొమ్మలు వెతుకుతున్న బీజేపీ …?

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు బీజేపీ కొత్త స్కూల్ స్టార్ట్ చేసింది. ఆ కాన్సెప్ట్ నే మా ప్రధాని బొమ్మ ఎక్కడా ? ఎందుకు కేంద్ర సహకారంతో [more]

Update: 2021-09-10 00:30 GMT

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు బీజేపీ కొత్త స్కూల్ స్టార్ట్ చేసింది. ఆ కాన్సెప్ట్ నే మా ప్రధాని బొమ్మ ఎక్కడా ? ఎందుకు కేంద్ర సహకారంతో అమలౌతున్న పథకాలకు రాష్ట్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫ్లెక్సీ లో బొమ్మేది ? శిలాఫలకంలో పేరేది ? కేంద్రం ఇచ్చే నిధుల వివరాలు ఎందుకు ప్రచారం చేయడం లేదు ?ఇలాంటి అంశాల్లో సీరియస్ గా హడావిడి ని ఏపీ బీజేపీ నేతలు ఇటీవల చేస్తూ ఉండటం గమనార్హం.

గతంలో బాబు అంతే … ఇప్పుడు జగన్ ఇంతే …

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా ఏపీ బీజేపీ ఈ అంశాలపై నిలదీసేది. కానీ నాడు కూడా బాబు సర్కార్ లైట్ తీసుకుని అన్ని కేంద్ర పథకాలను అలాగే ఇచ్చే నిధులను తమ ప్రభుత్వ ఘనతగానే చాటుకునేది. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా అదే చేస్తుంది. అక్కడక్కడా మాత్రం ప్రధాని బొమ్మలు ఆయా పథకాలపై దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ నేతలు సొంత ఖర్చులతో ఇటీవల మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పథకాలు, ఇచ్చే నిధుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు.

ఏపీ లో ఎంత చేసినా …

ఆంధ్రప్రదేశ్ లో నేతలు ఎంత చేసినా బీజేపీ పైకి లేచే పరిస్థితి దాదాపు కనిపించడం లేదు. కళ్ళముందు స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, పోర్ట్ లు, పోలవరం ఇలాంటి అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి 2014 నుంచి ఇప్పటివరకు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దాంతో ఫ్లెక్సీలో బొమ్మలు, శిలాఫలకాలపై పేర్లు వేసినా జనం పట్టించుకునే పరిస్థితి లేదన్నది నేతలు ఇంకా అర్ధం చేసుకోవడం లేదు. ఇప్పటికే రోడ్లు, రైల్వే, ఎల్ ఐ సి, స్టీల్ ప్లాంట్ లు, ఎయిర్ పోర్ట్ లు అన్ని ప్రైవేట్ కి అప్పగించే పనిలో కేంద్రం బిజీ కావడంతో ఆయా సంస్థల్లో ఉన్న వారు ఉద్యోగ భద్రత కోసం మోడీ బొమ్మను పెద్దగానే ముద్రించి ప్లే కార్డు ల్లో కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ నిత్యం ఉద్యమాలు చేస్తూనే రోడ్లపై దర్శనమిస్తున్నారు.

Tags:    

Similar News