ఆలోచనల్లో మార్పు వచ్చిందా?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లో ఏదో జరుగుతుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర నాయకత్వం ఏపీ బీజేపీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. [more]

Update: 2021-09-07 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లో ఏదో జరుగుతుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర నాయకత్వం ఏపీ బీజేపీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏపీలో ఈసారి ఒంటరిగా పోటీ చేయకూడదన్న నిర్ణయానికి కేంద్ర నాయకత్వం వచ్చింది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ ముందుకు వెళ్లాలననుకుంది. కానీ అధికారంలోకి రావడానికి ఈ బలం కూడా సరిపోదని బీజేపీ భావిస్తుంది.

మరింత బలోపేతం చేసే….

అందుకే బీజేపీని ఏపీలో మరింత బలోపేతం చేసే దిశగా చర్యలను ప్రారంభించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు కేంద్ర స్థాయిలో ఏమాత్రం సీట్లు తక్కువయినా జగన్ మద్దతు తమకు అవసరమవుతుందన్నది బీజేపీ భావన. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో క్రియా శీలకంగా మారుతుండటంతో జగన్ పైన కూడా బీజేపీకి డౌట్లు మొదలయ్యాయి.

జగన్ ను నమ్ముకుంటే…?

అందుకే జగన్ ను ఒక్కడినే నమ్ముకుంటే ప్రయోజనం లేదన్న నిర్ణయానికి బీజేపీ కేంద్రనాయకత్వం వచ్చింది. టీడీపీతో జత కలిస్తే పార్లమెంటు స్థానాలు సొంతంగా ఎక్కువ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికైనా సిద్ధపడుతోంది. అయితే ఇందుకు సోము వీర్రాజు అంగీకరించడం లేదు. ఏపీలో బీజేపీని ఎదగనివ్వ కుండా చేసిందే టీడీపీయేనని సోము వీర్రాజు వాదిస్తున్నారు.

నచ్చ చెప్పేందుకు….

గత ఎన్నికల్లో మోదీని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించిన మాటలను కూడా గుర్తు చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని బీజేపీ నేతలు నచ్చ చెబుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ డిమాండ్ చేసే అవకాశముందన్నది బీజేపీ అంచనా. అలా పార్టీని ఏపీలో ఎదిగేలా చూడాలని వారు భావిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ పెద్దల ఆలోచన ధోరణి టీడీపీ పట్ల మారిందనే చెప్పాలి.

Tags:    

Similar News