బీజేపీ ధైర్యం ఇదేనా? జగన్ వీక్ నెస్ అదేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విషయంలో బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. జాతీయ స్థాయిలో జగన్ తమను తప్పించి వేరే కూటమిలో చేరే అవకాశం లేదన్న నమ్మకం ఆపార్టీకి [more]

Update: 2021-06-07 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విషయంలో బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. జాతీయ స్థాయిలో జగన్ తమను తప్పించి వేరే కూటమిలో చేరే అవకాశం లేదన్న నమ్మకం ఆపార్టీకి ఉంది. అందుకే వైసీపీపై పదే పదే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ జైలుకు వెళతారని జోస్యం చెబుతున్నారు. జగన్ కు తాము తప్ప వేరెవ్వరూ దిక్కులేదన్న అభిప్రాయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. అందుకే వైసీపీపై ఫైట్ మోడ్ లోకి వెళ్లాలని కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్స్ అందాయంటున్నారు.

కన్నా ఉన్నప్పడు……

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంపై కొంత దూకుడుగానే ఉండేవారు. అమరావతి రాజధాని, శాసనమండలి రద్దు వంటి అంశాలపై కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకించారు. అయితే అప్పట్లో కేంద్ర నాయకత్వమే కన్నా దూకుడుకు కళ్లెం వేసిందని చెబుతారు. ఆయనకు పదవి రెన్యువల్ చేయకపోవడానికి ప్రధాన కారణం వైసీపీ నుంచి వచ్చిన విజ్ఞప్తులేనని అప్పట్లో రెండు పార్టీల నుంచి విన్పించాయి.

మళ్లీ స్పీడ్ పెంచి…..

ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిధులను కన్నా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కానీ కన్నాకు అండగా ఎవరూ నిలబడలేదు. కానీ సోము వీర్రాజు వచ్చిన తర్వాత జగన్ పై తొలినాళ్లలో కొంత మెతక వైఖరినే అవలంబించారు. కానీ ఆలయాలపై దాడుల సంఘటనల నుంచి బీజేపీ మళ్లీ స్పీడ్ పెంచింది. జగన్ ను వెంటాడాలని కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు.

తాము తప్ప జగన్ కు…..

జగన్ తో తమకు అవసరం లేదని, జగన్ కు తమ అవసరమే ఉందని బీజేపీ కేంద్ర నాయకత్వం భావించడమే ఇందుకు కారణం. జాతీయ స్థాయిలో జగన్ కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసే అవకాశం లేదు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయ్యే అవకాశాలు అసలే లేవు. దీంతో జగన్ ఎంత రాజకీయంగా ఇబ్బంది పెట్టినా తమ వైపే ఉంటారని బీజేపీ విశ్వసిస్తోంది. అలాగే తిరుపతి ఉప ఎన్నికను చూసీ చూడనట్లు వదిలేయాలని కేంద్రనాయకత్వం సూచించినట్లు తెలిసింది. అయినా జగన్ పట్టించుకోక పోవడంతో బీజేపీ స్పీడ్ పెంచిందంటున్నారు. భవిష్యత్ లో ఈ వేగం మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News