బీజేపీకి ఇక నూకలు చెల్లినట్లే

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకు అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు [more]

Update: 2021-02-16 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకు అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి ఇక్కడ ఎదిగే ఛాన్స్ లేకుండా చేస్తుంది. గత ఏడేళ్ల నుంచి ఇదే పరిస్థిితి. ఇప్పటి వరకూ ఏపీ బీజేపీ నేతలు తమ పార్టీ సొంతంగా ఎదగలేకపోవడానికి అనేక కారణాలు చూపుతున్నారు. ఇందులో ప్రధానంగా క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం ఒకటి.

బాబుతో పొత్తు కారణంగా….

ఇక మరొక కారణం చంద్రబాబు పార్టీతో పొత్తు కారణంగా తాము ఎదగలేకపోతున్నామని చెబుతూ వచ్చారు. చంద్రబాబు నీడలో తాము ఎదగలేకపోయామని, ఇక ఆయనను కలుపుకుని అవకాశమే లేదని చెబుతున్నారు. సొంతంగా ఎదుగుతామని చూసుకోవాలని సవాల్ విసురుతున్నారు. జనసేనను కూడా కలుపుకోవడంతో కొద్దో గొప్పో రాష్ట్ర బీజేపీకి ఆశలు పెరిగాయి. టీడీపీని దెబ్బకొట్టి తాము అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే చర్చ కూడా ప్రారంభించారు.

కొంత బలం ఉన్నట్లు అన్పించినా…

ఇప్పటి వరకూ బీజేపీకి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత బలం ఉన్నట్లు అనిపించింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీకి నాయకత్వమే లేదు. క్యాడర్ కూడా లేకపోవడతో అక్కడ ఎదిగే అవకాశాలు లేవు. అమరావతి రాజధాని విషయంలో బీజేపీ ఆడుతున్న డ్రామాలతో దాదాపు ఐదు జిల్లాల్లో ఆ పార్టీకి డిపాజట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. తిరుపతి ఉప ఎన్నికలో గుప్పిిట మూసి ఉంచినట్లు ఏదో ఉందని భ్రమలు కన్పిస్తున్నా తెరిస్తే ఏమీ ఉండదన్నది అందరికీ తెలిసిందే.

అక్కడ కూడా ఫట్టే….

ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడంతో ఆ ఎఫక్ట్ ఉత్తరాంధ్రలోనూ పడుతుంది. గతంలో బీజేపీ విశాఖ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇలాంటి నిర్ణయాలతో ఇక భవిష్యత్ లో ఆ అవకాశం కూడా ఉండదు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి చేసేందేమీ లేకపోయినా ఉన్న వాటిని తీసివేస్తూ ప్రజలను బీజేపీకి మరింత దూరం చేస్తున్నారన్నది కాదనలేని వాస్తవం. మరి చూడాలి బీజేపీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఏంచేస్తుందో?

Tags:    

Similar News