సోము స్టాండ్ మార్చుకోవడంతో… సీన్ ఛేంజ్ అయిందా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ వేరు. తెలంగాణ బీజేపీ వేరు. తెలంగాణ బీజేపీలో అనేక మంది వచ్చి చేరినా వారు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. వారి రాజకీయ భవిష్యత్ కూడా [more]

Update: 2021-01-31 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ వేరు. తెలంగాణ బీజేపీ వేరు. తెలంగాణ బీజేపీలో అనేక మంది వచ్చి చేరినా వారు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. వారి రాజకీయ భవిష్యత్ కూడా బీజేపీతోనే ముడి పడి ఉందన్న నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో ఎప్పటికైనా బీజీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ లో మాత్రం వేరుగా ఉంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడమేనది కష్టమే. విజయం కనుచూపు మేరలో కన్పించడం లేదు. దీంతో బీజేపీ లో చేరిన నేతలు యాక్టివ్ గా లేరు.

అనేక మంది నేతలను…

ప్రధానంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత పది మందికి పైగా నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ లైన్ ను తప్పి వ్యవహరించారని, మాట్లాడారని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అధికార ప్రతినిధి పదవుల నుంచి తొలగించారు. అయితే ఇందులో సస్పెండ్ అయిన వారిలో ఎక్కువ మంది టీడీపీకి మద్దతుగా నిలిచిన వారే. బీజేపీలో తమను తాము రక్షించుకోవడం కోసమే వారు వచ్చినట్లు గుర్తించి సోము వీర్రాజు ఈ చర్యలు తీసుకున్నారు.

లైన్ మార్చుకోవడంతో…..

సోము వీర్రాజు తొలుత టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేవారు. చంద్రబాబు పై మాటల దాడికి దిగేవారు. అయితే ఇటీవల కాలంలో బీజేపీ తన లైన్ ను మార్చుకుంది. కేవలం టీడీపీని టార్గెట్ చేయకుండా ప్రభుత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానంగా ఆలయాలపై దాడుల వెనక బీజేపీ నేతల ప్రమేయం ఉందని డీజీపీ ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వంపై మరింత ఆగ్రహంతో ఉన్నారు. త్వరలోనే కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ రథయాత్రను కూడా బీజేపీ నేతలు చేపట్టారు.

ఇప్పుడు యాక్టివ్ కావడం వెనక?

దీంతో గత కొంతకాలంగా ఇన్ యాక్టివ్ గా ఉన్న టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. వారి లక్ష్యం వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కావడం, సోము వీర్రాజు సయితం అదే లైన్ ను అందిపుచ్చుకోవడంతో వలస వచ్చిన నేతలు కసి తీరా పనిచేయడానికి రెడీ అయిపోయారు. సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఇప్పుడు యాక్టివ్ కావడం వెనక సోము వీర్రాజు తన స్టాండ్ ను మార్చుకోవడమేనంటున్నారు.

Tags:    

Similar News