బీజేపీవి ఎప్పుడూ వంకర రాజకీయాలే?

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానంగా హిందూ ఓటు బ్యాంకునే నమ్ముకుని అన్ని చోట్లా అది బరిలోకి దిగుతుంది. అయితే [more]

Update: 2020-12-26 11:00 GMT

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానంగా హిందూ ఓటు బ్యాంకునే నమ్ముకుని అన్ని చోట్లా అది బరిలోకి దిగుతుంది. అయితే కొన్ని చోట్ల సక్సెస్ అయినట్లు అన్ని చోట్లా విజయం సాధిచాలనుకోవడం అత్యాశే అవుతుంది. తెలంగాణలో బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఏపీ బీజేపీలో కూడా జోష్ మొదలయింది. తాము కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకంతో కాషాయ దళం ఉంది.

అదొక్కటే బలం….

నిజానికి బీజేపీ కి ఉన్న ఏకైక బలం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండటమే. ఏమీ లేని చోట ఎగిరెగిరి పడినా ఎలా గెలుస్తారన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోతంది. దీంతో తిరుపతి ప్రాంతంలో సెంటిమెంట్ ను రగిలించేందుకు బీజేపీ నేతలు సిద్ధమయిపోయారు. హనుమంతుడి పుట్టుక ఈ ప్రాంతంలో జరిగిందన్న ప్రచారం జోరుగా చేస్తున్నారు. హనుమంతుడి పుట్టిన చోట బీజేపీకి ఓటు వేయాలన్న రూల్ ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు మాత్రం వారి నుంచి సమాధానం లేదు.

రాయలసీమ రెఫరెండం….

మరోవైపు కొత్తగా రాయలసీమ రెఫరెండంను బీజేపీ నేతలు బయటకు తెచ్చారు. రాయలసీమలోని 51 నియోజకవర్గాల్లో తిరిగి ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. నిన్న మొన్నటి వరకూ రాయలసీమ ఊసెత్తని బీజేపీకి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఆ ప్రాంత సమస్యలపై గళం విప్పుతోంది. రాయలసీమకు గత దశాబ్దాలుగా అన్యాయం జరగుతుందని విమర్శలు చేస్తున్నారు.

హిందూ ఓటు బ్యాంకును…..

ఇక తిరుపతి ఉప ఎన్నికలలోపు మరికొన్ని హిందూ అంశాలతో బీజేపీ యుద్ధానికి సిద్ధమయినట్లే కన్పిస్తుంది. డబుల్ సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో కూలగొట్టిన గుడులను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద బీజేపీకి ఏపీలో ఎప్పుడూ స్ట్రయిట్ పాలిటిక్స్ చేసిన సందర్భాలు లేవు. ఎప్పుడూ వంకర రాజకీయాలనే నడుపుతుందన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇక ఉప ఎన్నికల లోపు ఎన్ని వేషాలు బయటకు వస్తాయో చూడాలి మరి.

Tags:    

Similar News