అందరూ సంజయ్ లవ్వాలనుకుంటే ఎలా?

తెలంగాణలో క్లిక్ అయినంత మాత్రాన అదే పంథా ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తే అది వర్క్ అవుట్ అవుతుందా? కానీ కమలనాధులు మాత్రం అదే పంథాలో పయనిస్తున్నారు. తెలంగాణలో [more]

Update: 2020-12-22 11:00 GMT

తెలంగాణలో క్లిక్ అయినంత మాత్రాన అదే పంథా ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తే అది వర్క్ అవుట్ అవుతుందా? కానీ కమలనాధులు మాత్రం అదే పంథాలో పయనిస్తున్నారు. తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లోనూ రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కానీ ఏపీలో ఇది సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు అనేక విషయాల్లో తేడాలున్నాయి. ఇది గమనించని బీజేపీ నేతలు తెలంగాణలో మాదిరిగానే ఇక్కడా హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

మళ్లీ సర్జికల్ స్ట్రయిక్స్….

అందుకు ఉదాహరణే ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలే. ఏపీలో ట్విన్ సర్జికల్ స్ట్రయిక్స్ చేయాల్సి ఉంటుందని ఆయన అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రయిక్స్ వ్యాఖ్యలను తొలిసారి చేశారు. ఇది కొంత వరకూ అక్కడ వర్క్ అవుట్ అయింది. అందుకే బీజేపీకి ఎక్కువ స్థానాలను గ్రేటర్ ఎన్నికల్లో లభించాయన్న విశ్లేషణలూ ఉన్నాయి.

బలం ఎక్కడ?

కానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా జీవీఎల్ నరసింహారావు చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్ పెద్దగా పేలని పరిస్థితి. ఎందుకంటే ఏపీలో తెలంగాణలో మాదిరి బీజేపీ బలంగా లేదు. అక్కడ ఉన్న సెంటిమెంట్లు కూడా ఇక్కడ పెద్దగా కన్పించవు. అక్కడ రాష్ట్రాని ఇవ్వడంలో బీజేపీ సహకరించింది. ఇక్కడ రాష్ట్ర ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టింది. పోలవరంపై డ్రామాలాడుతుంది.

అంత సీన్ లేదు….

దీంతో ఏపీలో బీజేపీకి మద్దతు ప్రజల నుంచి దొరుకుతుందనుకోవడం వారి అత్యాశే అవుతుంది. నిజానికి ఏపీలో గత కొన్నేళ్లుగా బీజేపీ బలపడాలనుకుంటున్నా అది జరగడం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. తెలంగాణలో ఉన్న మాదిరిగా ఇక్కడ జన్ సంఘ్ కూడా పెద్దగా లేదు. ఆర్ఎస్ఎస్ ఆనవాళ్లు కూడా ఏపీలో తక్కువగానే కన్పిస్తాయి. అలాంటి ఏపీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటూ హిందూ ఓటు బ్యాంకు ను ఏకం చేయాలనుకోవడం వృధా ప్రయాసే అవుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News